Watch Video: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక క్రికెట్ లో తరచుగా ఎన్నో రకరకాల, చిత్ర విచిత్రమైన, ఫన్నీ సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. క్రికెట్ ఎప్పుడు ఊహించని మలుపులు తిరుగుతుందన్న విషయం చాలామందికి తెలిసిందే. ఈ క్రికెట్ లో ఎప్పుడు చూడని కొన్ని అద్భుతమైన, హాస్య భరితమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఓ సంఘటనే ఇటీవల ఓ మ్యాచ్ లో చోటుచేసుకుంది. దీంతో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Asia Cup 2025: దరిద్రం అంటే ఇదే.. ఆసియా కప్ 2025 లో ఈ తోపు క్రికెటర్లను మిస్ కాబోతున్నాం
వాస్తవానికి క్రికెట్ లో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అలాంటి ఆటగాళ్లను కేవలం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో అప్పటివరకు ఎలాగైనా ఈ వికెట్ పడగొట్టాలని ఎదురుచూసే జట్టు.. ఆ ప్రత్యర్థి బ్యాటర్ ఏ చిన్న తప్పిదం చేసినా అతడి వికెట్ పడగొట్టాలని చూస్తూ.. అవకాశం వస్తే అస్సలు వదులుకోదు. ప్రత్యర్థి బ్యాటర్ ఎటువంటి పరిస్థితులలో ఉన్నా వీరికి సంబంధం ఉండదు. కానీ ఓ బౌలర్ మాత్రం తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. వైరల్ గా మారిన ఈ వీడియోలోని మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఆ ప్రత్యర్థి బ్యాటర్ బంతిని షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. ఆ బంతి వైడ్ గా వెళ్ళిపోయింది.
దీంతో ఆ బంతిని అంపైర్ వైడ్ గా ప్రకటించాడు. కానీ నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ మాత్రం రన్ కి పరిగెత్తాడు. దీంతో స్ట్రైక్ లో ఉన్న బ్యాటర్ రన్ తీసేందుకు ప్రయత్నించి కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయాడు. దీంతో కీపర్ వెంటనే ఆ బంతిని బౌలర్ కి అప్పగించడంతో.. అతడిని రనౌట్ చేసే అవకాశం బౌలర్ కి ఉన్నప్పటికీ.. అతడు కింద పడిపోయాడన్న సానుభూతితో ఆ బౌలర్ అతడిని రనౌట్ చేయకుండా తిరిగి మరో బంతి వేసేందుకు వెళ్ళిపోయాడు. దీంతో ఆ బౌలర్ ప్రదర్శించిన ఈ క్రీడా స్ఫూర్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ బౌలర్ చేసిన పనికి నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆసియా కప్ 2025 టోర్నీ కోసం టీమ్ ఇండియా జట్టు ప్రకటన:
ఆసియా కప్ 2025 టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి {బిసిసిఐ} భారత జట్టును ఆగస్టు 19 {నేడు} ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ప్రకటించబోతోంది. బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలో నేడు మధ్యాహ్నం 1:30 గంటలకు జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ సమావేశంలో భారత టి-20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా పాల్గొంటారు. ఇక ఈ సమావేశం తర్వాత టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, సూర్య కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడతారు.
🚨 ONCE IN A LIFE TIME MOMENT 🚨
– Batter crumbled down while running, and then the Bowler did this and won the hearts of millions 👏🏻
– A Must Watch Video 🧐 pic.twitter.com/GZgnU50rjC
— Richard Kettleborough (@RichKettle07) August 19, 2025