Spy Pigeon: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని భవానిపేట గ్రామంలో ఒక్కసారిగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని ఒక మైనర్ బాలుడు ఆడుకుంటూ ఉండగా అనుమానాస్పదంగా ఒక పావురం చిక్కింది. మొదట్లో అది సాధారణ పావురమే అనుకున్నారు. కానీ దగ్గరగా గమనిస్తే అందరికీ ఆశ్చర్యానికిగ గురిచేసింది.
ఆ పావురం కాలుకి ఒక చిన్న కోడ్ రింగ్ కట్టబడి ఉంది. అదీ కాకుండా దాని రెక్కలపై కొన్ని కోడ్ లెటర్స్ కూడా కనిపించాయి. సాధారణంగా పావురాలపై ఇలాంటి గుర్తులు ఉండవు. అందుకే గ్రామస్తులు ఆలోచించడం మొదలుపెట్టారు. ఇది గూఢచారి పావురమా? ఏదైనా రహస్య సమాచారం తీసుకెళ్తుందా? అనే అనుమానాలు కలగడంతో భయాందోళనకు గురయ్యారు.
గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొద్ది సేపట్లో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ పావురాన్ని అదుపులోకి తీసుకున్నారు. దాని కాలి వద్ద ఉన్న రింగ్‌ను, రెక్కలపై ఉన్న అక్షరాలను గమనించి జాగ్రత్తగా ఫోటోలు తీసారు. ఈ కోడ్ లెటర్స్‌కి అర్థం ఏమిటి, అవి ఏ దేశానికి సంబంధించినవి అనేది తెలుసుకునేందుకు సాంకేతిక నిపుణుల సహాయం తీసుకోవాలని నిర్ణయించారు.
Also Read: Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థి లడ్డూ ప్రసాదం.. సింపుల్ రెమెడీ.. తింటే వావ్ అనాల్సిందే
ప్రస్తుతం పోలీసులు పావురాన్ని పరిశీలన కోసం వెటర్నరీ వైద్యులకు అప్పగించారు. ఆ తర్వాత నిపుణులతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో కూడా దర్యాప్తు జరపాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు గతంలో కూడా భారత్‌లో చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో అప్పుడప్పుడూ పావురాలను గూఢచార్యం కోసం వాడిన సందర్భాలు బయటపడ్డాయి. అందువల్లే ఈ ఘటనపై పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
గ్రామస్థులు మాత్రం ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. “మన ఊరికి ఇలా ఒక పావురం రావడం వెనుక ఏం మిస్టరీ ఉందో? ఇది నిజంగా గూఢచారి పావురమేనా?” అని చర్చించుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భయాందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఈ కేసులో కోడ్ రింగ్, కోడ్ లెటర్స్ వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి అన్నది బయటకు రావాల్సి ఉంది. ఇది సాధారణ పావురమేనా? లేక నిజంగా గూఢచార్యం కోసం ఉపయోగించిన పావురమేనా? అనే విషయాలు పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు సస్పెన్స్ కొనసాగనుంది.
పోలీసుల అదుపులో పావురం. .
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని భవానిపేట గ్రామంలో గూఢచారి పావురం అంటూ ప్రచారం
మైనర్ బాలుడికి అనుమానాస్పదంగా దొరికిన పావురం
గూఢచారి పావురం కాలికి కోడ్ రింగ్
రెక్కలపై కోడ్ లెటర్స్ ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు
పావురాన్ని అదుపులోకి… pic.twitter.com/H3XRKZmby8
— BIG TV Breaking News (@bigtvtelugu) August 19, 2025