Junior trailer out : తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు ఉన్నారు. అలానే బ్యాగ్రౌండ్ తో కూడా వచ్చిన హీరోలు ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి హీరోగా పరిచయం అవుతుంది సినిమా జూనియర్. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పాట బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా ఆ పాటలో కిరీటి డాన్స్ చేసిన విధానం విపరీతంగా చాలా మందిని ఆకట్టుకుంది.
ఆ పాటను చూసి చాలామంది జూనియర్ ఎన్టీఆర్ తో కూడా కిరీటిని పోల్చారు. మామూలుగా శ్రీ లీల ఎంత బాగా డాన్స్ చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. తన ఎనర్జీ ని మ్యాచ్ చేయడం అంటేనే మామూలు విషయం కాదు. అది చాలా అవలీలగా కిరీటి చేసేసాడు. అలానే దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారింది. ఈ చిత్రం నుంచి ప్రస్తుతం ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ట్రైలర్ ఎలా ఉంది.?
వాస్తవానికి ట్రైలర్ గురించి చెప్పాలి అంటే మామూలు తెలుగు రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలు ఎలా ఉంటాయో అలానే ఉంది. కథలో కనీసం కొత్తదనం లేదు అనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అన్ని కమర్షియల్ హంగులు ఉన్నాయి అని ఈజీగా అర్థమవుతుంది. ఈ సినిమాలో ఒక కాలేజీ స్టూడెంట్ గా కనిపిస్తున్నాడు కిరీటి. అలానే కాలేజీ అమ్మాయిగా కనిపిస్తుంది శ్రీ లీలా. ఈ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్, అవినాష్ కొల్ల పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత ముందుకు వెళ్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి తరుణంలో ఒక కాలేజీ బ్యాక్ డ్రాప్, ఊర్లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం. కానీ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని అర్థమవుతుంది.
డాన్సులనే నమ్ముకోవాలి
ముఖ్యంగా ఈ సినిమాకి మంచి పేరు తీసుకొచ్చింది మాత్రం ఈ సినిమా నుంచి విడుదలైన పాట. అయితే పాటలు సినిమా మీద అంచనాలను క్రియేట్ చేస్తాయి. కానీ సినిమాను కాపాడాల్సిన మాత్రం కథ, కథనం. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అది అంతగా వర్కౌట్ అయ్యేలా లేదు. ఈ చిత్ర యూనిట్ ఇంకా డాన్సుల్నే నమ్ముకోవాలి ఏమో అనిపిస్తుంది. రీసెంట్ గా హీరో కిరీటి మాట్లాడుతూ కూడా ఈ సినిమాలో ఇంకో రెండు డాన్స్ నెంబర్లు ఉన్నాయని ఒక వేడుకలో తెలిపారు. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో రిలీజ్ తర్వాత తెలియనుంది.