BigTV English

Superman Review : ‘సూపర్‌మ్యాన్’ సినిమా రివ్యూ… ఎపిక్ కానీ ఇంటెన్స్ కాదు

Superman Review : ‘సూపర్‌మ్యాన్’ సినిమా రివ్యూ… ఎపిక్ కానీ ఇంటెన్స్ కాదు

రివ్యూ : సూపర్ మ్యాన్
నటీనటులు: డేవిడ్ కోరెన్‌స్వెట్ (సూపర్‌మ్యాన్/క్లార్క్ కెంట్), రాచెల్ బ్రోస్నహాన్ (లోయిస్ లేన్), నికోలస్ హౌల్ట్ (లెక్స్ లూథర్), ఎడి గథెగి (మిస్టర్ టెరిఫిక్) తదితరులు
దర్శకత్వం: జేమ్స్ గన్
నిర్మాతలు: జేమ్స్ గన్, పీటర్ సాఫ్రాన్, లార్స్ పి. వింథర్


Superman Review In Telugu : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హాలీవుడ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘సూపర్‌మ్యాన్: లెగసీ’ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగు పెట్టింది. ఇండియాలో ఏకంగా ఈ సినిమా 1000కి పైగా థియేటర్లలో విడుదల కావడం విశేషం. ఈ చిత్రంలో డేవిడ్ కోరెన్‌స్వెట్ (David Corenswet) కొత్త సూపర్‌మ్యాన్‌గా కనిపించగా, రాచెల్ బ్రాస్నహన్, నికోలస్ హౌల్ట్ కీలక పాత్రల్లో నటించారు. సూసైడ్ స్క్వాడ్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన జేమ్స్ గన్ ఈ సినిమాకు డైరెక్టర్ గా వర్క్ చేయడంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ‘సూపర్ మ్యాన్’ ఆ అంచనాలను అందుకోగలిగాడా? అన్నది రివ్యూలో తెలుసుకుందాం.

గత కొన్ని దశాబ్దాలుగా సూపర్‌మ్యాన్ పాత్ర అనేక తరాలను అలరిస్తూ వచ్చింది. ఈ సూపర్‌హిట్ ఫ్రాంచైజీని మరోసారి కొత్త శైలిలో ప్రదర్శించే పనిని DC స్టూడియోస్ చేపట్టింది. ప్రత్యేకత ఏమిటంటే ఈసారి ఈ బాధ్యతను మార్వెల్ స్టూడియోస్ ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ డైరెక్టర్ జేమ్స్ గన్‌కు అప్పగించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హాలీవుడ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘సూపర్‌మ్యాన్: లెగసీ’ ఈ శుక్రవారం థియేటర్లలోకి అడుగు పెట్టింది. ఇండియాలో ఏకంగా ఈ సినిమా 1000కి పైగా థియేటర్లలో విడుదల కావడం విశేషం. ఈ చిత్రంలో డేవిడ్ కోరెన్‌స్వెట్ (David Corenswet) సూపర్‌మ్యాన్‌గా కనిపించారు. మరి ఈ కొత్త ‘సూపర్ మ్యాన్’ అంచనాలను అందుకోగలిగాడా? అన్నది రివ్యూలో తెలుసుకుందాం.


కథ
సూపర్‌మ్యాన్ (డేవిడ్ కోరెన్స్‌వెట్) ఓవైపు ప్రమాదాల నుంచి కాపాడుతూనే, మరోవైపు న్యూస్ రిపోర్టర్‌గా పని చేస్తాడు. ఈ సూపర్‌మ్యాన్ అవతార్ గురించి తన స్నేహితురాలికి మాత్రమే తెలుసు. కాగా సూపర్‌మ్యాన్ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపుతాడు. అమెరికా స్నేహపూర్వక దేశమైన బోరావియా ఆక్రమించాలనుకుంటున్న జర్హాన్‌పూర్ ప్రజలను కాపాడాలని అనుకుంటాడు. అతను ఇలా చేసినప్పుడు, అమెరికా ప్రజలు అతనికి వ్యతిరేకంగా మారతారు. మధ్యలో లెక్స్ లూథర్ అనే (విలన్) బిలియనీర్ వ్యాపారవేత్త, అతను సూపర్‌మ్యాన్‌పై అసూయపడి ఈ పరిస్థితులను ఉపయోగించుకుని అందరినీ సూపర్‌మ్యాన్‌కు వ్యతిరేకంగా మారుస్తాడు. ఇప్పుడు సూపర్‌మ్యాన్ తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుంటాడు? ఈ సమస్య నుండి తనను, అమెరికన్లను ఎలా కాపాడుకుంటాడు? అన్నది స్టోరీ.

విశ్లేషణ
‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ వంటి హిట్ ఫిల్మ్ ఫ్రాంచైజీలను సృష్టించిన జేమ్స్ గన్, సూపర్‌మ్యాన్ కథను ముందుకు తీసుకెళ్లడానికి చాలా ప్రయోగాలు చేశాడు. కొత్త పాత్రలతో పాటు, ఇందులో భారీ VFX వాడకం కూడా గట్టిగానే ఉంది. ఈసారి సూపర్‌మ్యాన్‌కు జస్టిస్ గ్యాంగ్, ఇతర పాత్రల మంచి ప్రాధాన్యత లభించింది. సినిమా ప్రారంభం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మధ్యలో చాలాసార్లు దర్శకుడు తడబడినప్పటికీ, చివరి వరకు అలరిస్తుంది. సినిమా క్లైమాక్స్ కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇదంతా సూపర్ మ్యాన్ అభిమానులకు అన్పించే విషయం.

గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’, మార్వెల్ ‘థోర్’, ‘స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్’ వంటి చిత్రాలను తీసిన దర్శకుడు జేమ్స్ గనేనా ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అన్పిస్తుంది. సామాన్యుడు తయారు చేసిన అధునాతన యంత్రాల వల్ల దెబ్బలు తింటూ, ఏడుస్తూ, భావోద్వేగానికి లోనవుతూ ఉండే సూపర్‌మ్యాన్‌ను చూడాలని బహుశా ఎవ్వరూ అనుకోరేమో. సినిమాలో హీరో కంటే క్రిప్టో పాత్ర పవర్ ఫుల్ గా అన్పిస్తుంది. చిన్న పిల్లల సినిమాలాగే అన్పిస్తుంది. అయితే సినిమాలో రెండు ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. దీనికంటే బాహుబలి, కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాలే బెటర్. ఈ సినిమా నేపథ్య సంగీతం కూడా అంతగా గుర్తుండిపోయేది కాదు. ఏమైనప్పటికీ VFX అదిరిపోయింది.

నటీనటుల నటన గురించి మాట్లాడుకుంటే, డేవిడ్ కోరెన్స్‌వెట్ కొత్త సూపర్‌మ్యాన్‌గా అదరగొట్టాడు. రాచెల్ బ్రోస్నాహన్ తన స్నేహితురాలి పాత్రలో చాలా బాగుంది. విలన్ పాత్రలో కనిపించే నికోలస్ హోల్ట్ ఒకానొక సమయంలో తన విలన్ల సైన్యంతో సూపర్‌మ్యాన్‌ను కూడా అధిగమిస్తాడు. ‘ఎక్స్-మెన్’ సిరీస్‌లో హాంక్స్/బీస్ట్ పాత్రలో కనిపించే వ్యక్తి ఆయనే. ఆయన నటన బాగుంది. కానీ అతని పాత్రను సరిగ్గా రూపొందించలేదు. మొత్తం సినిమాలో ఎవరైనా అద్భుతమైన నటన కనబరిచారా? అంటే అది సూపర్‌మ్యాన్ సూపర్‌డాగ్ క్రిప్టో. ఈ పాత్ర గ్రాఫిక్స్ అయినప్పటికీ, అది వచ్చినప్పుడల్లా ముఖంలో చిరునవ్వు తెస్తుంది. మిగతా నటులందరూ తమ పాత్రల్లో బాగా చేశారు.

ప్లస్ పాయింట్స్
నటన
హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ
విజువల్స్
జస్టిస్ గ్యాంగ్

మైనస్ పాయింట్స్
CGI
ప్రొడక్షన్ లోపాలు
ఓవర్‌లోడెడ్ కథనం

మొత్తానికి
సూపర్‌మ్యాన్ అభిమాని అయితే ఈ వీకెండ్ ఒక లుక్కెయ్యెచ్చు. కాకపోతే కిస్ సీన్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలతో చూసేటప్పుడు జాగ్రత్త.

Superman Rating : 1.5/5

Related News

Baaghi 4 Review : ‘బాఘీ 4’ మూవీ రివ్యూ… దుమ్మురేపే యాక్షన్, కానీ అసలు కథ మిస్

The Conjuring: Last Rites Review : ‘ది కాంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్’ రివ్యూ… లొరైన్ దంపతులకు పర్ఫెక్ట్ సెండాఫ్

Madharaasi Movie Review : ‘మదరాసి’ మూవీ రివ్యూ: ‘తుపాకీ’ స్టైల్లో ఉన్న డమ్మీ గన్

Ghaati Movie Review : ఘాటీ రివ్యూ – ఇదో భారమైన ఘాట్ రోడ్

Madharaasi Twitter Review: మదరాసి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ

Ghaati Twitter Review: ‘ఘాటీ’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Big Stories

×