E-Paper
Advertisement

భూముల రీ-సర్వేలో అలసత్వం.. సర్వేయర్‌ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!

భూముల రీ-సర్వేలో అలసత్వం.. సర్వేయర్‌ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!
Advertisement

Land Resurvey: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ సర్వే ప్రక్రియలో భాగంగా కేటాయించిన విధులు నిర్వర్తించడంలో అలసత్వం ప్రదర్శించిన లైసెన్సుడ్ సర్వేయర్ బాలకృష్ణ లైసెన్స్ ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సస్పెన్షన్ చేశారు. భూముల రీ సర్వేలో భాగంగా మొదటి దశలో జిల్లాలోని 70 గ్రామాల్లో రీ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్లతో పాటు, ప్రభుత్వ ఆమోదం పొందిన లైసెన్సుడ్ సర్వేయర్లు భూముల రీ సర్వే ప్రక్రియలో పాల్గొంటున్నారు.

కొన్ని రోజుల నుండి నిర్లక్ష్యం..

గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి గ్రామంలో భూముల రీ సర్వే కొనసాగుతుండగా, సర్వే కోసం కేటాయించిన లైసెన్సుడ్ సర్వేయర్ ఎం.బాలకృష్ణ గత కొన్ని రోజుల నుండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భూముల రీ సర్వే ప్రక్రియలో పాల్గొనకుండా, గైర్హాజరు కావడం పట్ల జిల్లా కలెక్టర్ సంబంధిత లైసెన్సుడ్ సర్వేయర్ పై చర్యలు తీసుకున్నారు.

ఉత్తర్వులు జారీ..

Advertisement

లైసెన్సుడ్ సర్వేయర్ బాలకృష్ణ లైసెన్స్‌ను సస్పెన్షన్ చేస్తూ ఆదివారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ సర్వే ప్రక్రియలో భాగస్వామ్యమైన అధికారులు అందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు.

Also Read: పిల్లలు కూడా ఇష్టంగా తినే మష్రూమ్ ఫ్రైడ్ రైస్.. తయారీ చాలా సులభం!

Tags

Related News

సీఎం రేవంత్ రెడ్డికి.. సంచలన లేఖ రాసిన కల్వకుంట్ల కవిత!

పాలమూరులో ప్రైవేట్ ఆసుపత్రుల దందా.. పట్టించుకోని అధికారులు!

ఉస్మాన్‌నగర్ కేజీబీవీలో దారుణం.. వంట మనుషులు లేరని చదువుకు తాళం!

హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ వేడుకలు!

హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర.. రేపు ఈ రూట్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు!

ఘట్‌కేసర్‌లో ఇద్దరు మైనర్ బాలురు మిస్సింగ్.. 3 గంటల్లో చేదించిన పోలీసులు!

మార్కేట్‌లో భగ్గుమంటున్న బియ్యం ధరలు.. ఒక క్వింటాల్‌కి ఏంతో తెలుసా..?

Big Stories

Advertisement
×