Samantha -Raj Nidimoru: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే అమ్మగా ప్రమోట్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే.ఏ క్షణమైన సమంత (Samantha)నుంచి గుడ్ న్యూస్ అభిమానులకు రాబోతోంది. ప్రస్తుతం సమంత తొమ్మిదవ నెల ప్రెగ్నెన్సీ తో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఏ క్షణమైనా సమంత డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే తనకు సంబంధించిన అన్ని షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారు. త్వరలోనే తమ బిడ్డకు వెల్కమ్ చెప్పబోతున్న నేపథ్యంలో బిడ్డకు కావలసిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిత్యం తన బేబీ బంప్ తో తన ప్రెగ్నెన్సీ విషయాలను అభిమానులతో పంచుకుంటున్న సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక క్యూట్ ఫోటోని షేర్ చేశారు ఇందులో భాగంగా సమంత భర్త రాజ్ నిడిమోరు (Raj Nidimoru)పుట్టబోయే బిడ్డ కోసం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ ఫోటోలో ఈయన బేబీకి సంబంధించిన వస్తువులన్నింటినీ సెట్ చేస్తూ కనిపించారు. ఇలా రాజ్ ఈ ఏర్పాట్లలో బిజీగా ఉన్న నేపథ్యంలో సమంత అతి త్వరలోనే డెలివరీ కాబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈమె స్కార్పియో బేబీకి జర్మన్ ఇవ్వబోతున్నారు అంటూ సమంత స్నేహితురాలు డెలివరీ డేట్ కి సంబంధించిన వివరాలను తెలిపారు.
అక్టోబర్ 23 వ తేదీ నుంచి నవంబర్ 21వ తేదీ మధ్య జన్మించే పిల్లలను స్కార్పియో బేబీ అంటారని, సమంత కూడా స్కార్పియో బేబీకి జన్మనివ్వబోతున్నారంటూ తన స్నేహితురాలు చెప్పడంతో సమంత డెలివరీ డేట్ దగ్గర పడిందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్ సైతం పుట్టబోయే బిడ్డకు కావలసిన ఏర్పాట్లు చేస్తూ బిజీ అయ్యారు. మరి సమంత ఎవరికి జన్మనివ్వబోతుందనేది తెలియాల్సింది అయితే సోషల్ మీడియాలో ఈమె కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి .మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
సమంత గత ఏడాది డిసెంబర్ 1వ తేదీ ఈషా ఫౌండేషన్ లోని లింగ బైరవి ఆలయంలో రాజ్ తో ఏడడుగులు నడిచారు. సమంతకు ఇది రెండో వివాహం కావటం గమనార్హం. ఇలా రెండో పెళ్లి తర్వాత సమంత కెరియర్ పరంగా బిజీ అవుతున్న నేపథ్యంలోనే ఈమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేశారు. దీంతో ఇండస్ట్రీకి మరోసారి చిన్న విరామం ప్రకటించారు. ఇక పెళ్లి తర్వాత సమంత మా ఇంటి బంగారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వంద కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించారు. ఇలా నిర్మాతగా హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభించి బిజినెస్ ఉమెన్ గా కూడా సమంత సక్సెస్ సాధించారు.
Also Read: ఆ ఒక్క నిర్ణయం నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది: యాంకర్ సుమ