E-Paper
Advertisement

మైసా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. విశ్వరూపం చూపించిన రష్మిక!

మైసా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. విశ్వరూపం చూపించిన రష్మిక!
Advertisement

Mysaa Movie: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) ఇటీవల తన భర్త విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో కలిసి రణబాలి(Ranabali ) సినిమా చేసి.. అందులో జయమ్మ పాత్రతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. అలాంటి ఈమె ఇప్పుడు నటిస్తున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ మైసా(Mysaa). రవీంద్ర పుల్లె (Rawindra pulle) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్,మలయాళం, కన్నడ భాషలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. గోండు గిరిజనుల విలక్షణ సంస్కృతి, జీవన విధానం నేపథ్యంగా భావోద్వేగాలు, పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్ ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ పై అజయ్, అనిల్ సయ్యపు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్.

ఓ మైసా రే అంటూ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్..

అందులో భాగంగానే టీ-సిరీస్ సంస్థ ఈ సినిమా నుండి రాబోయే మొదటి పాట ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇందులో రష్మిక తన అసాధారణమైన పర్ఫామెన్స్ తో విజృంభించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. “యుద్ధ నినాదం మరింత బిగ్గరగా వినిపిస్తోంది” అంటూ రిలీజ్ చేసిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది. ఓ మైసా రే అంటూ సాగుతున్న ఈ సాంగ్ ప్రోమోలో ఒక చేతిలో బల్లెం మరొక చేతిలో వేట కొడవలి పట్టుకొని గోండు జాతి అమ్మాయిగా రష్మిక కనబరిచిన పెర్ఫార్మన్స్ అందరినీ ఆకట్టుకుంది.

విజృంభించిన రష్మిక..

Advertisement

ముఖ్యంగా ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అంతలా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది రష్మిక . ఇన్ని రోజులు తన గ్లామర్ తో ఆకట్టుకున్న రష్మిక తొలిసారి తన టాలెంట్ ఏంటో చూపించబోతోంది. ఇకపోతే ఈ పాటను నవంబర్ 2వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు తాజా ప్రోమోతో స్పష్టం చేశారు. ఇక ప్రోమోతోనే ఈ రేంజ్ లో హైప్ ఇచ్చారంటే ఇక ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయితే ఈ పాట యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.

also read: ముఖేష్ స్లో పాయిజన్.. నిజాలు కక్కేసిన దేబ్జానీ!

రష్మిక తదుపరి చిత్రాలు..

Advertisement

ప్రఖ్యాత కర్ణాటక గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో రష్మిక మందన్న నటిస్తోంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అనగా 2027 మార్చి 18న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప 3: ది రాంపేజ్ లో శ్రీవల్లిగా మరోసారి నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ప్రకటించనున్నట్లు సమాచారం. అలాగే బాలీవుడ్ మూవీ యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ లో కూడా మరోసారి నటించబోతోంది. ఈ చిత్రానికి సందీప్ రెడ్డివంగా దర్శకత్వం వహిస్తున్నారు.

?obrf=MTQ1ZTc3ZHI1bmJneA==

 

Related News

ఇండస్ట్రీలో మరీ మంచితనం పనికిరాదు.. జ్యోతి పూర్వాజ్ షాకింగ్ కామెంట్స్!

స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న రన్యారావుకి రాజ మర్యాదలు..అసలేం జరుగుతోంది?

పుట్టబోయే బిడ్డ కోసం సమంత భర్త రాజ్ కష్టాలు… క్యూట్ ఫోటో షేర్ చేసిన సామ్!

మరోసారి రంగస్థలం మ్యాజిక్ రిపీట్ అవుతుందా? చరణ్ – సుకుమార్ మూవీ స్టార్ట్!

రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ ఎమోషనల్..పోస్ట్ వైరల్!

సమంతకు కవల పిల్లలా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

చిరు చేతుల మీదుగా ఆర్‌సీ17 గ్రాండ్ ప్రారంభం.. సుకుమార్ భార్య ఎమోషనల్ పోస్ట్!

Big Stories

Advertisement
×