E-Paper
Advertisement

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. సంచలన పోస్ట్ చేసిన జ్యోతిక!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. సంచలన పోస్ట్ చేసిన జ్యోతిక!
Advertisement

Jyothika: ప్రముఖ సినీనటి జ్యోతిక గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు హీరోయిన్ గా, మరొకవైపు నిర్మాతగా దూసుకుపోతున్న ఈమె.. ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు తన సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరొకవైపు సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే విద్య, మహిళా సాధికారత వంటి వాటిపై తరచూ స్పందించే జ్యోతిక.. తాజాగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలి అంటూ ఒక సుదీర్ఘ సంచలన పోస్టు పంచుకుంది.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి – జ్యోతిక

నీట్ పరీక్షలో ఏర్పడిన అవకతవకల కారణంగా కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులకు అండగా.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) రాజీనామా చేయాలి అనే డిమాండ్ తో సీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసన సెగ ఢిల్లీలో మొదలై ఇప్పుడు కేరళ, ముంబై, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ వంటి ప్రాంతాలకు చేరుకుంది . ముఖ్యంగా పలుచోట్ల విద్యార్థులు నిరసనలు తెలుపుతూ న్యాయం జరగాలి అంటూ కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ సెలబ్రిటీలు కూడా విద్యార్థులకు అండగా నిలుస్తూ సోషల్ మీడియా ద్వారా , కొంతమంది నేరుగా నిరసనల్లో పాల్గొంటూ తమ మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా సామాజిక అంశాలపై ఎప్పుడూ స్పందించే జ్యోతిక.. నీట్ విద్యార్థులకు అండగా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ప్రతి తల్లి అలాగే ఆలోచించాలి అంటూ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

Advertisement

ALSO READ:OTT Apps banned:కేంద్రం కఠిన నిర్ణయం.. 50 ఓటీటీలు బ్యాన్!

ఈ తరం యువతను చూస్తుంటే గర్వంగా ఉంది – జ్యోతిక

తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా.. నేను ఎప్పుడు దేశ భవిష్యత్తుకు, విద్యార్థుల తరపునే నిలబడతాను. తమ హక్కుల కోసం భయం లేకుండా పోరాడుతున్న నేటితరం యువతను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ప్రతి తల్లి తమ పిల్లలను సోనం వాంగ్ చుక్, సౌరవ్ దాస్, అభి జీత్ దీప్ కే వంటి ఆదర్శవంతమైన వ్యక్తులుగా పెంచాల్సిన అవసరం ఉంది. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి తల్లి ఆలోచించాలి. సమాజం, విద్యార్థుల హక్కుల కోసం నిలబడే వారిని చూసి నేను గర్విస్తున్నాను. భయం లేకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సీజేపీకి ప్రత్యేక ధన్యవాదాలు. నీట్ పేపర్ లీక్ కు కారణమైన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి..”అంటూ ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు పంచుకున్న పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా జ్యోతిక(Jyothika) షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

నీట్ విద్యార్థులకు అండగా సినీ సెలెబ్రిటీలు..

Advertisement

ఇకపోతే ఒక తల్లిగా విద్యార్థులకు అండగా.. పౌరురాలిగా దేశ భవిష్యత్తుకు తన వంతు పాటు పడుతోంది జ్యోతిక. జ్యోతికతో పాటు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ మద్దతు పలుకుతున్నారు. సల్మాన్ ఖాన్ , ప్రకాష్ రాజ్ లాంటి ఎంతోమంది తారలు సోషల్ మీడియా వేదికగా మద్దతు పలుకుతుంటే.. గౌరీ జి కిషన్, ప్రియా వారియర్,ఆయేషా ఖాన్ లాంటి తారలు నేరుగా నిరసనల్లో పాల్గొంటున్నారు.

Related News

మా ఆయనకే లేని నొప్పి మీకెందుకురా నాయనా?.. సాలిడ్ పంచ్ ఇచ్చిన వెటరన్ బ్యూటీ !

అమల అక్కినేని ‘బ్లూ క్రాస్’ ఆరంభం వెనుక నిజాలు బయటపెట్టిన అఖిల్!

నాతో పని చేసిన వాళ్ళు మళ్ళీ ఎందుకు చేయరంటే ..సాయి రాజేష్ షాకింగ్ రివీల్!

“అయ్యగారు” అంటూ పార్టీల్లో ఆటపట్టించేవారు.. అఖిల్ షాకింగ్ కామెంట్స్!

పవన్ సాయి,కళ్యాణ్ పడాల ఇష్యూపై ‘బిగ్ బాస్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

కోట్లు ఉన్నా కీప్యాడ్ ఫోన్ మాత్రమే.. నోలన్ ఫోన్ వాడకపోవడానికి అసలు కారణం ఇదేనా?

లహరి షారి నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..? హీరోయిన్ కన్నా ఎక్కువే..

Big Stories

Advertisement
×