Chiranjeevi: మెగా కుటుంబ సభ్యులకు రాష్ట్రంలో వరుసగా కీలక పదవులు లభిస్తుండడంతో సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. విషయంలోకి వెళ్తే.. మెగా డాటర్ చిరంజీవి (Chiranjeevi) కూతురుగా, ప్రముఖ నిర్మాతగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సుస్మిత కొణిదెల(Sushmita Konidela) కు రాష్ట్రంలో కీలక బాధ్యతలు అప్పగించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్టు బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలను దుర్గమ్మ ఆలయ ట్రస్టు బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ.. దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు . ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు ,ప్రత్యేక ఉత్సవాలలో సుస్మిత కొణిదెల భాగస్వామ్యమై తగిన సూచనలు, సలహాలు అందించనున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు ప్రముఖులు ,నెటిజన్లు, మెగా అభిమానులు సుస్మిత కొణిదెలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోదరుడు నాగబాబు(Nagababu) కి కూడా కీలక బాధ్యతలు అందించిన విషయం తెలిసిందే. మెగా బ్రదర్ గా, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న కొణిదెల నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన క్యాబినెట్ హోదా కలిగిన పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనను AP – Green (ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్ రిచ్మెంట్ ) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నియమించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చొరవతోనే సుస్మిత కి ఈ బాధ్యతలు అప్పగించారు అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
also read:ఓటీటీలోకి సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వైరల్!
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలా మెగా కుటుంబీకులకు వరుసగా రాష్ట్రంలో కీలక పదవులు, బాధ్యతలు లభిస్తుండడంతో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మెగా కుటుంబీకులకే ఈ పదవులు ఇస్తారా? లేక టాలెంటు ఉన్న మిగతా వ్యక్తులకు అవకాశం కల్పిస్తారా? అనే రేంజ్ లో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుండడం గమనార్హం. ఇక మరొకరు ఇంటిల్లిపాదికి పదవులు ఇచ్చుకొని క్యాడర్ కి ఏం సమాధానం చెప్పుకుంటారు అని కామెంట్ చేస్తుంటే.. ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నారు ఇప్పుడు కూటమి చేస్తోంది ఏంటి? అంటూ ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి దీనిపై మెగా ఫ్యామిలీ స్పందిస్తుందా అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.