BigTV English

Jyothika: అంతా స్వార్థపరులే.. సౌత్ ఇండస్ట్రీ పై నటి జ్యోతిక షాకింగ్ కామెంట్స్

Jyothika: అంతా స్వార్థపరులే.. సౌత్ ఇండస్ట్రీ పై నటి జ్యోతిక షాకింగ్ కామెంట్స్

Jyothika: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి జ్యోతిక(Jyothika) ఒకరు. ఈమె ఎన్నో అద్భుతమైన తమిళ సినిమాలతో పాటు తెలుగు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇక హీరోయిన్ గా తన కెరీర్ మంచి పొజిషన్ లో ఉన్న సమయంలోనే ఈమె సినీ నటుడు సూర్యను (Suriya) వివాహం చేసుకొని కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల జ్యోతిక తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తూ సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా నిర్మాతగా మారి పలు సినిమాలను కూడా నిర్మిస్తున్నారు.


బాలీవుడ్ హీరో పై ప్రశంసలు..

ఇలా కెరియర్ పరంగా తిరిగి ఎంతో బిజీ అయిన జ్యోతిక తాజాగా సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రదుమారం రేపుతున్నాయి. తాజాగా ఈమె ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్(Ajay Devgan) తో పాటు, కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్(Madhavan) కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతిక మాట్లాడుతూ.. జ్యోతిక అజయ్ దేవగన్ తో కలిసి షైతాన్ సినిమాలో కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అజయ్ షూటింగ్ చేసే విధానం తనకు బాగా నచ్చుతుందని తెలిపారు. అదే విధంగా షైతాన్ సినిమా పోస్టర్ ను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.


సినిమా పోస్టర్లు హీరోయిన్స్ ఉంటే ఇష్టపడరు…

ఇలా ఆయన తన సోషల్ మీడియాలో సినిమా పోస్టర్ షేర్ చేయడం చూసి తాను ఆశ్చర్యపోయానని, అదేవిధంగా మమ్ముట్టి గారు కూడా కాథల్ ది కోర్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దక్షిణాది సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు ఇలా ఎవరు చేయలేదు. నేను చాలామంది దక్షిణాది సినీ హీరోలతో కలిసి సినిమా చేశాను. కానీ ఆ హీరోలు ఎవరో కూడా వారి సోషల్ మీడియా వేదికగా సినిమా పోస్టర్లు షేర్ చేయలేదు. వారంతా స్వార్థపరులని ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక దక్షిణాది హీరోలు(South Heroes) పోస్టర్లలో హీరోయిన్లు ఉండటం ఏమాత్రం ఇష్టపడరని ఈమె చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.

హీరోయిన్లకు గుర్తింపు ఇవ్వరు…

ఇలా మమ్ముట్టి, అజయ్ దేవగన్ గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ దక్షిణాది సినీ హీరోలపై జ్యోతిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలకు కారణమయ్యాయి. సౌత్ హీరోలు హీరోయిన్లను వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారే తప్ప వారికంటూ ఒక గుర్తింపు ఇవ్వాలని అసలు కోరుకోరు. ఇలా సౌత్ హీరోల గురించి జ్యోతిక చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక త్వరలోనే అజయ్ దేవగన్ జ్యోతిక మాధవన్ కాంబినేషన్లో షైతాన్ సీక్వెల్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Kanakaratnamma’s funeral: ముగిసిన కనకరత్నమ్మ అంత్యక్రియలు.. పాడే మోసిన చిరు, చరణ్!

Related News

Nani : నాని గురించి వాళ్ళ పిన్ని ఏం మాట్లాడారో తెలుసా? వింటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి

Balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్న బాలయ్య… స్టేజ్ పై హీరో రియాక్షన్

Nandamuri Balakrishna: సీఎం రిలీఫ్ ఫండ్ కు బాలకృష్ణ భారీ విరాళం

Amitabh Bachchan: సారీ బాలకృష్ణ … బాలయ్యకు లేఖ రాసిన అమితాబ్ !

Tvk Party – Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతిలో విజయ్ టీవీకే పార్టీ జెండా?

NTR-Neel Movie: ప్రశాంత్‌ నీల్‌ భారీ స్కేచ్‌.. కేజీయఫ్‌, సలార్‌ల మించి ఎన్టీఆర్‌-నీల్‌ మూవీ, బడ్జెట్‌ పరిమితులే లేవు..

Big Stories

×