Big Tv Kissik talks Promo:ఈ మధ్యకాలంలో ఆడియన్స్ ను అలరించడానికి.. సెలబ్రిటీలను ఆడియన్స్ కు చేరువ చేయడానికి చాలా షోలు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే బిగ్ టీవీ కూడా ఒక వినూత్న ప్రయోగం చేస్తూ కనుమరుగైన సెలబ్రిటీలను మళ్ళీ తెరపైకి తీసుకొస్తూ.. వారికంటూ తిరిగి గుర్తింపును అందించే ప్రయత్నం చేస్తోంది .ఈ క్రమంలోనే కిస్సిక్ టాక్స్ అనే ఒక టాక్ షో ను నిర్వహిస్తూ.. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష(Jabardast varsha) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు 24 ఎపిసోడ్లు అంటే 24 మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన వర్ష.. ఇప్పుడు 25వ ఎపిసోడ్ లో భాగంగా ప్రముఖ సీనియర్ హీరోయిన్ గీతా సింగ్ (Geeta Singh) ను ఇంటర్వ్యూ చేయబోతున్నారు.
కిస్సిక్ టాక్స్ కి గెస్ట్ గా వచ్చిన గీతా సింగ్..
అందులో భాగంగానే ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసిన గీతా సింగ్ తన కెరియర్లో జరిగిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా మంచు విష్ణు (Manchu Vishnu) క్యారెక్టర్ ని కూడా ఆమె ఇక్కడ రివీల్ చేయడం హైలైట్ గా నిలిచింది. పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా వర్షా మాట్లాడుతూ.. “మీకు సపోర్టుగా నిలిచింది మీ కొడుకు ఒక్కరే అని విన్నాను.అది నిజమేనా?” అని ప్రశ్నించారు.
ALSO READ:Maheshbabu: రెండోసారి మహేష్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ.. లక్ అంటే ఈమెదే!
మంచు విష్ణు పై ఊహించని కామెంట్స్ ..
గీతా సింగ్ మాట్లాడుతూ.. “అవును, నా కొడుకు నాకు అన్ని విధాలుగా అండగా నిలిచారు. ముఖ్యంగా మా అబ్బాయి ఆ స్టేజ్ కి రావడానికి కారణం మంచు విష్ణు, మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu)అని చెప్పాలి. మోహన్ బాబు యూనివర్సిటీలో మంచు విష్ణు నా కొడుకుకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత విద్య అందించారు. అసలు ఆయన నా కొడుకుపై ఇంత దయ చూపిస్తారని ఏ రోజు కూడా అనుకోలేదు. ముఖ్యంగా ఒక్క రూపాయి తీసుకోకుండా నా కొడుకుకి కాలేజీలో ఉచిత విద్య అందించారు ఆయన చాలా గ్రేట్ ” అంటూ మంచు విష్ణు తో పాటు మంచు మోహన్ బాబుపై కూడా ప్రశంసలు కురిపించారు గీతా సింగ్. ఇకపోతే గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో విభేదాలు, వివాదాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మంచు విష్ణు క్యారెక్టర్ గురించి గీతా సింగ్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడంలో మంచు విష్ణు ఎప్పుడూ ముందుంటారు అంటూ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది గీతా సింగ్. ఇకపోతే గీతా సింగ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆమె పూర్తి ఎపిసోడ్ లో ఏం మాట్లాడింది అనే విషయం తెలియాలి అంటే ఈరోజు రాత్రి 7 గంటల వరకు ఎదురు చూడాల్సిందే.