BigTV English

Kanakaratnamma’s funeral: ముగిసిన కనకరత్నమ్మ అంత్యక్రియలు.. పాడే మోసిన చిరు, చరణ్!

Kanakaratnamma’s funeral: ముగిసిన కనకరత్నమ్మ అంత్యక్రియలు.. పాడే మోసిన చిరు, చరణ్!

Kanakaratnamma’s funeral: ప్రముఖ దివంగత సినీ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ(Allu Kanakaratnamma) నేడు ఉదయం అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. 94 సంవత్సరాల వయసులో అనారోగ్య సమస్యల కారణంగా వృద్ధాప్య సమస్యలతో అర్ధరాత్రి 1:45 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఇలా అల్లు కనక రత్నమ్మ మరణ వార్త తెలియగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ramcharan Tej) పెద్ది సినిమా షూటింగ్ పనులను పక్కన పెట్టి మైసూర్ నుంచి హడావిడిగా వచ్చారు. అలాగే అల్లు అర్జున్(Allu Arjun) సైతం ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక అల్లు కనక రత్నమ్మ చివరి చూపు కోసం మెగా హీరోలు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చే ఆమెకు నివాళులు అర్పించారు.


కోకాపేటలోని అల్లు వ్యవసాయ క్షేత్రం…

ఇకపోతే తాజాగా ఈమె అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తన అత్తయ్య పాడే మోసారు. చిరంజీవితోపాటు రామ్ చరణ్, అల్లు అర్జున్ అలాగే అల్లు అర్జున్ తనయుడు అయాన్(Ayaan) కూడా ఆమె పాడే మోస్తూ అంతిమయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక కనకరత్నమ్మ మరణ వార్త తెలుసిన మెగా అల్లు అభిమానులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఇక కనక రత్నమ్మ అంత్యక్రియలు కోకాపేటలోని అల్లు వ్యవసాయ క్షేత్రంలో జరిగాయి. అల్లు అరవింద్ తన తల్లి అంతిమ సంస్కారాలను నిర్వహించారు.


ఎమోషనల్ అయిన చరణ్…

ఇక కనక రత్నమ్మ మరణ వార్తతో అల్లుఅయాన్ , అల్లు అర్జున్ ఎంతో ఎమోషనల్ అవుతూ కనిపించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక తన నాన్నమ్మ మరణ వార్త తెలియగానే ఈయన హుటా హుటిన ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక రామ్ చరణ్ కూడా పెద్ది సినిమా షూటింగ్ పనులలో భాగంగా మైసూర్లో ఉండగా తన అమ్మమ్మ మరణ వార్త తెలిసి షూటింగ్ పనులను పక్కన పెట్టి హైదరాబాద్ చేరుకున్నారు. తన అమ్మమ్మ కనక రత్నమ్మను చివరిసారిగా చూస్తూ అల్లు అర్జున్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఎమోషనల్ పోస్ట్ చేసిన చిరు..

ఇక కనకరత్నమ్మ మరణించడంతో మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. మా అత్తగారు కనక రత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం.మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఓం శాంతి అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. ఇక ఈమె మరణ వార్త తెలిసి మెగా కుటుంబ సభ్యులతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, హీరోలు, దర్శకులు కూడా అల్లు అరవింద్ ఇంటికి చేరుకొని కనక రత్నమ్మ గారికి నివాళులు అర్పించారు. ఇక పవన్ కళ్యాణ్, నాగబాబు రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్నారు. రేపు నాగబాబు అల్లు కుటుంబాన్ని పరామర్శించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ రాని నేపథ్యంలో ఆయన సతీమణి అన్నా లెజినోవా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కనక రత్నమ్మ గారికి నివాళులు అర్పించారు.

Also Read: Sivakarthikeyan: ఆయనే నాకు స్ఫూర్తి సినీ ఎంట్రీ పై శివ కార్తికేయన్ కామెంట్స్!

Related News

Tvk Party – Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతిలో విజయ్ టీవీకే పార్టీ జెండా?

NTR-Neel Movie: ప్రశాంత్‌ నీల్‌ భారీ స్కేచ్‌.. కేజీయఫ్‌, సలార్‌ల మించి ఎన్టీఆర్‌-నీల్‌ మూవీ, బడ్జెట్‌ పరిమితులే లేవు..

S.S.Thaman: తమన్ అంతమాటనేశాడేంటి బ్రో.. అది కూడా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే బాలయ్యను..!

Rajinikanth: ఆ మాటలు బాలకృష్ణ మాత్రమే చెప్పాలి, బాలకృష్ణ పై రజినీకాంత్ వీడియో

Jalsa Re Release: అల్లు అరవింద్‌ తల్లి కనకరత్నమ్మ మృతి.. పవన్‌ ‘జల్సా’ రీ రిలీజ్‌ వాయిదా!

Janhvi kapoor : ముగ్గురు పిల్లలు కావాలని ముచ్చట పడుతున్న ముద్దుగుమ్మ… అదే కారణమా?

Big Stories

×