E-Paper
Advertisement

ఇద్దరి మధ్య నిజంగానే ఏదైనా ఉందా?.. కృతి సనన్ -కబీర్ ఫోటో వైరల్

ఇద్దరి మధ్య నిజంగానే ఏదైనా ఉందా?.. కృతి సనన్ -కబీర్ ఫోటో వైరల్
Advertisement

Kabir Bahia’s Post for Kriti Sanon:కృతి సనన్…పేరు చెబితే టక్కున గుర్తు పట్టలేకపోవచ్చు కాని,మహేష్ కి జోడీగా నేనొక్కడినే, ప్రభాస్ ఆదిపురుష్  సినిమాలో సీతగా  నటించిన బాలీవుడ్ బ్యూటీ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఇదిగో ఆ భామే ఇపుడు మరోసారి వార్తల్లోకి ఎక్కేసింది.కారణం ఏదైనా సినిమా ఈవెంట్ అనుకుంటే మీరు మూవీల్లో మునకేసినట్టే.ఈసారి తను మీడియాలో హైలెట్ అవడానికి కారణం తన బర్త్ డే సందర్భంగా బయటికి వచ్చిన ఒక రేర్ ఫోటో.

అవును ..దానిని బయటికి వదిలింది ఫేమస్ బిజినెస్ పర్సన్ కబీర్ బాహియా (Kabir Bahia). “హ్యాపీ బర్త్‌డే K”  అంటూ ఎవరూ ఎప్పుడు చూడని ఒక రేర్ ఫోటోని నెట్టింట్లో వదిలాడు,ఇదిగో అక్కడే మొదలైన అసలైన చర్చ.ముఖ్యంగా పెట్టిన క్యాప్షన్ కంటే వదిలిన ఫోటోనే ఇద్దరి మధ్య సమ్ థింగ్  సమ్ థింగ్  ఏమైనా ఉందా అంటూ ఆరాలు తీయడం మొదలెట్టారు నెటిజన్లు.

Advertisement

ఇద్దరు కలిసి కలిసి చాలా సార్లు మీడియాకి

నిజానికి గతంలో  కృతి సనన్, కబీర్ బాహియా కలిసి చాలా సార్లు మీడియాకి చిక్కినట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి.అయితే ఎప్పటిలాగే అఫీషియల్ గా తమ రిలేషన్ షిప్ పై ఎక్కడా నోరు విప్పలేదు ఈజోడీ.కాని వీరి నుండి వస్తున్న చిన్న చిన్న హింట్స్ అండ్ అప్ డేట్స్ మాత్రం మరింత పెంచుతూనే ఉన్నాయి. ఇక తాజాగా కృతి సనన్ కి విషెస్ చెబుతూ ఎవరూ చూడనటు వంటి ఫోటో సోషల్ మీడియాలో వదలడంతో మరింత క్యూరియస్ గా ఇద్దరి మధ్య రిలేషన్ ఎంటా అని ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement

ఇక పోస్ట్ బయటకు వచ్చిందో లేదో ఫోటో పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.”ఇది కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమేనా?”, “ఇద్దరి మధ్య నిజంగానే ఏదైనా ఉందా?”,”కొంపదీసి “త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా?” అంటూ రకరకాల కామెంట్లతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు మరోవైపు కొందరు మాత్రం వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, ప్రతి ఫోటోకు రిలేషన్ ట్యాగ్ పెట్టడం సరైంది కాదని తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు

కెరీర్ విషయానికి వస్తే

కృతి సనన్ కెరీర్ విషయానికి వస్తే 2024లో విడుదలైన టేరీ బాతోన్ మేన్ ఐసా ఉల్ఝా జియా సినిమాలో షాహిద్ కపూర్‌తో కలిసి నటించి మంచి విజయాన్నిఅందుకుంది.అదే ఏడాది విడుదలైన క్రూ చిత్రంలో కరీనా కపూర్, టబుతో కలిసి నటించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడమే కాకుండా కృతి నటనకు కూడా మంచి ప్రశంసలు తెచ్చిపెట్టాయి కూడా.

ఈ ఏడు కాక్ టెయిల్ 2లో 

అంతకుముందు 2023లో ప్రభాస్‌తో కలిసి నటించిన ఆదిపురుష్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ప్పటికీ సినిమా రిజల్ట్ ఏమైందో మనకు తెల్సిందే.అయితే సీత పాత్ర పోషించిన  కృతికి మంచి అప్లాజ్ దక్కింది.అలాగే 2021లో వచ్చిన మిమీ చిత్రంతో ఆమె కెరీర్‌లోనే మైల్ స్టోన్ గా నిలిచి ఏకంగా  జాతీయ ఉత్తమ నటి అవార్డు తెచ్చిపెట్టింది కూడా.ఇక ఈ ఏడు హోమీ ఆదజానియ దర్శకత్వంలో కాక్ టెయిల్ 2 లో నటించిన సంగతి తెల్సిందే.

ఇక కబీర్ బాహియా విషయానికి వస్తే,ఆయన సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి కాకపోయినా, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో  పరిచయాలు ఉన్నాయన్న సంగతి తెల్సిందే.అందుకే కృతి పుట్టినరోజు సందర్భంగా ఆయన షేర్ చేసిన ఈ ఒక్క ఫోటో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.

ముందు ముందు ఏమైనా నోరు విప్పుతారేమో

అయితే ఇప్పటివరకు కృతి సనన్ గానీ, కబీర్ బాహియా గానీ తమ సంబంధంపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు.అయినా నెట్టింట్లో  కనిపించే ప్రతి కొత్త ఫోటో, ప్రతి చిన్న పోస్ట్ ఇద్దరి గురించి కొత్త డిబేట్ కి దారి తీస్తూనే ఉంది, చూడాలి మరి ఈ ప్రేమాయణం పై వీరే ముందు ముందు ఏమైనా నోరు విప్పుతారేమో !

Related News

బన్నీ మూవీలో హీరోయిన్ ఉండదా? మార్క్ చూపించబోతున్న లోకేష్!

హీరో విశాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ?

హీరో జయంరవికి కోర్టులో ఊరట.. భార్యకి షాక్!

“జబర్దస్త్‌కి అప్పటి క్రేజ్ లేదు.. అసలు కారణం ఇదే!”

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ‘రావు బహదూర్’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది!

షూటింగ్లో గాయపడ్డ జూ.ఎన్టీఆర్.. స్పందిస్తున్న సెలబ్రిటీస్!

ఫ్యాన్స్ మీట్ లో అల్లు అర్జున్.. ట్రోల్స్ వద్దు బ్రదర్!

Big Stories

Advertisement
×