Revanth Reddy: ఢిల్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతున్న హైడ్రా వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని, ఈ పనులను మరింత వేగంగా కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. విపక్షాలు, ఆక్రమణదారులు ఎంత మొత్తుకున్నా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
పేదలైనా.. పెద్దలైనా వదిలేదే లేదు
తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద పాలనా సంస్కరణ హైడ్రా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కబ్జాకోరులకే హైడ్రా వద్దనిపిస్తోందని ఎద్దేవా చేశారు. గండిపేట, బతుకమ్మ కుంటలను ఆక్రమించింది సామాన్య పేద ప్రజలా? లేక బడా బాబులా? అని ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ ఎవరిదో అందరికీ తెలుసని, అది పేదలది కాదని నిలదీశారు. ఆక్రమణలకు పాల్పడినవారు ఎంతటి బడా బాబులైనా, పేదలైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
బిఆర్ఎస్ కుట్రలు.. హైడ్రాపై పూర్తి స్పష్టత
ఏ అధికారిని ఎక్కడ నియమించాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారమని రేవంత్ స్పష్టం చేశారు. గతంలో ఉన్నతాధికారి సోమేష్ కుమార్‌పై 400 పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. బిఆర్ఎస్ నేతలు కేవలం దురుద్దేశంతోనే కేసులు వేస్తూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి, తదుపరి కార్యాచరణను రూపొందిస్తామని వెల్లడించారు. హైడ్రాను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై తమకు పూర్తి స్పష్టత ఉందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: శివరాజ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ.. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీపై కీలక చర్చ!
తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు
కబ్జారాయుళ్లకు మీడియా సంస్థలు కూడా సహకరించవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. కావాలని డబ్బులు గుమ్మరించి సోషల్ మీడియాలో హైడ్రాపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. చెరువుల పరిరక్షణ, భవిష్యత్ తరాల క్షేమం కోసమే ఈ నిర్ణయమని, ప్రజలు నిజాలను గ్రహించి మద్దతుగా నిలవాలని కోరారు.
అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం..
లోతుకుంట వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఎదురైన పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంలో తదుపరి చర్యలపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవెన్యూ, న్యాయ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోతుకుంట కేసుకు సంబంధించిన పూర్తి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. చట్టపరమైన అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత, అవసరమైతే హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది.
హైడ్రాను మరింత బలోపేతం చేస్తాం: రేవంత్ రెడ్డి
TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ హైడ్రా అని, దానిని మరింత బలోపేతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కబ్జాకోరులు తప్పుడు పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కాగా, హైడ్రా కమిషనర్… pic.twitter.com/c8y2xp1qVw
— BigTV APP (@BigtvApp) July 28, 2026