Team India : ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తొలి టెస్టులో టీమిండియా పై ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా అద్భుతంగా రాణించింది. కానీ రెండో ఇన్నింగ్స్ లో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ రెండింటిలో విఫలం చెందారనే చెప్పవచ్చు. ఎందుకంటే.. భారీ స్కోర్ చేస్తే ఇండియా విజయం సాధించేది. టీమిండియా చేసిన స్కోర్ 364 పరుగుల స్కోర్ ని కాపాడుకోలేకపోయింది. ఇంగ్లాండ్ జట్టు 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు అలవొకగా ఛేదించింది. టీమిండియా బౌలర్లు తొలి టెస్టులో అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీశాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. మిగతా బౌలర్లు కూడా అంతగా రాణించకపోవడంతో ఇంగ్లాండ్ జట్టుకి కలిసి వచ్చింది.
Also Read : WWE Ric Flair : ప్రమాదంలో WWE స్టార్ రిక్ ఫ్లెయర్… కడుపులో ఏకంగా 10 కుట్లు !
ఆటగాళ్లు బయటికీ రావొద్దు..
దీనికి తోడు భారత ఫీల్డర్లు క్యాచ్ లను మిస్ చేశారు. దీంతో విజయావకాశాలను చేజేతులా పోగొట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. వాస్తవానికి ఇవాళ్టి నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే టీమిండియా బస చేస్తున్న ఓ హోటల్ కి సమీపంలో అనుమానస్పద పార్సిల్ కలకలం రేపింది. దీంతో ఆటగాళ్లు బయటికీ రావొద్దని పోలీసులు సూచించారు. నిన్న ప్రాక్టీస్ నుంచి హోటల్ కి వెళ్లాక పోలీసులు అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. దాదాపు ఒక గంట తరువాత పరిస్థితి నార్మల్ అయినట్టు స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితి అంతా బాగానే ఉందని జట్టు ప్రతినిధి వెల్లడించారు. సోషల్ మీడియాలో నెటిజన్లు రెండో టెస్ట్ రద్దవుతుందని.. టీమిండియా ప్లేయర్ల పై కుట్రలు చేశారని రూమర్స్ వినిపించడం గమనార్హం.
రెండో టెస్ట్ కి సిద్ధం..
లీడ్స్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్న టీమిండియా.. ప్రస్తుతం సిరీస్ సమం చేయాలనే లక్ష్యంతో ఇవాళ రెండో టెస్ట్ కి సిద్ధమవుతోంది. ఇవాళ్టి నుంచే ఇంగ్లాండ్ తో రెండో టెస్టు జరుగనుంది. ఇక్కడ కూడా పిచ్ బ్యాటింగ్ కే అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో బజ్ బాల్ శైలీతో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ ను ఎదుర్కోవడం శుబ్ మన్ గిల్ బృందానికి సవాలే. లోయర్ ఆర్డర్, బౌలర్ల వైఫల్యం తొలి టెస్టులో భారత్ ను దెబ్బతీసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఇవాళ్టి నుంచి రెండో టెస్ట్ ఎడ్జ్ బాస్టన్ లో జరుగనుంది. అయితే అక్కడ భారత్ కి పెద్దగా కలిసి రాదు. ఇవాళ జరగబోయే మ్యాచ్ కలిసి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. తొలి టెస్టు మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ టీమిండియా బ్యాటింగ్ విభాగం బలంగానే కనిపిస్తోంది. తొలి టెస్ట్ లో భారత బ్యాటర్లు 5 సెంచరీలు చేశారు. జైస్వాల్, గిల్, రాహుల్ సెంచరీలు చేస్తే.. రిషబ్ పంత్ మాత్రం రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు చేశాడు. ఫామ్ లో ఉన్న వీళ్లు అదే ఫామ్ ని కొనసాగిస్తే.. ఇక భారత్ కి తిరుగుండదు.