Kajol : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె బాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.. సౌత్ ఇండస్ట్రీలో ధనుష్ నటించిన విఐపి సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించింది. ఈమె నటనకు సౌత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. మూడు దశాబ్దాలుగా నటనలో తనదైన ముద్ర వేసుకున్న కాజోల్ ఇప్పటికీ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. రీసెంట్ గా ఆమె తన 51 వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు.. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ప్రెస్ మీటింగ్ లో కాజల్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఇండస్ట్రీలో పలు రకాల వార్తలు వినిపిస్తుంది.. అసలు ఏం జరిగిందో కాస్త వివరంగా తెలుసుకుందాం..
విలేకర్ల పై కాజోల్ సీరియస్..
తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న కాజల్ విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పారు. తన సినిమాల గురించి చెప్తున్న సందర్భంలో ఓ విలేఖరి మేడం హిందీలో మాట్లాడండి అని అడిగారు. ఆ మాట వినగానే కాజల్ కు కోపం కట్టలు తెంచుకుంది. నేను హిందీలో మాట్లాడితే ఎవరికైనా అర్థం అవుతుందా అని అతనిపై సీరియస్ అయింది. నేను మరాఠీ ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడతాను అని చెప్పడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.. కొందరేమో ఆమెను సపోర్ట్ చేస్తూ అది ఆమె ఇష్టం ఆమె ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతుందో అది ఆమెకు సంబంధించింది అని కామెంట్ చేయగా.. మరికొందరేమో ఎందుకు కాజోల్ హిందీలో మాట్లాడడం లేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
Also Read: బాలీవుడ్ బడా హీరోతో బన్నీ మూవీ..బాక్సాఫీస్ పరిస్థితి ఏంటబ్బా..?
కాజోల్ సినిమాలు..
ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.. ఈమధ్య పలు హిందీ చిత్రాల్లోనూ, వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది.. హీరోయిన్ గా కన్నా ఇప్పుడు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒక్క సినిమాకే రూ.10 కోట్లు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న కాజోల్, సినిమాలకంటే ఎక్కువగా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు.. తన భర్త అజయ్ దేవగన్ కూడా భారీ ప్రాజెక్టులలో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఈ ఏడాదిగాను వీళ్ళ ఆస్తులు చూస్తే సుమారు రూ.249 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని సమాచారం.. ఇక మీదట ఈమె చేసే సినిమాలకు 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతుందని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. అంటే ఈమె ఒక పాత్రలో నటించాలంటే భారీగానే సమర్పించుకోవాలి. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది.