Warm Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెచ్చని నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామంది నమ్ముతారు. గోరు వెచ్చని నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ప్రయోజనాల మాట ఇలా ఉంటే.. గోరు వెచ్చని నీరు తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోరు వెచ్చని నీరు తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్:
శరీరానికి డీహైడ్రేషన్:
ఖాళీ కడుపుతో ఎక్కువగా వెచ్చని నీళ్లు తాగితే.. శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా శరీరం అంతటా వేడి పెరిగి, చెమట కూడా పడుతుంది. అంతే కాకుండా శరీరంలో ఉన్న ముఖ్యమైన లవణాలను, పోషకాలను కోల్పోయేలా చేస్తుంది. ఇది తలనొప్పి, అలసట, బలహీనతకు దారితీస్తుంది.
గ్యాస్ట్రిక్ సమస్యలు:
కొంతమందికి ఖాళీ కడుపుతో వెచ్చని నీళ్లు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఇది పొట్టలో అసిడిటీని పెంచుతుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారిలో ఇది చాలా ఎక్కువ. ఇది కడుపు నొప్పి, ఎసిడిటీ, ఛాతీలో మంట, వికారం వంటి సమస్యలకు కారణమవుతుంది.
జీర్ణక్రియకు ఆటంకం:
వెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది అనుకోవడం ఒక అపోహ. ఎక్కువగా వేడి ఉన్న నీళ్లు జీర్ణక్రియ ఎంజైమ్‌ల పనితీరుకు ఆటంకం కలుగుతుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మది చేసి, జీర్ణం కావడం ఆలస్యం చేస్తుంది.
Also Read: తరచూ గోళ్లు కొరుకుతున్నారా ? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే !
కిడ్నీలపై ఒత్తిడి:
ఖాళీ కడుపుతో ఎక్కువ మొత్తంలో వెచ్చని నీళ్లు తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. మూత్రపిండాలు నీటిని ఫిల్టర్ చేయడానికి ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
అధిక చెమట:
వెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో అధికంగా చెమట పట్టే అవకాశం ఉంటుంది. ఇది చర్మం పొడిబారడానికి, అంతే కాకుండా దురదకు కారణమవుతుంది.
దంతాల సమస్యలు:
వెచ్చని నీళ్లు తాగడం వల్ల దంతాలపై ఎనామెల్ దెబ్బతినే అవకాశం ఉంది. వేడి నీళ్లు దంతాలను సున్నితంగా మార్చి.. దంతాల నొప్పికి, పుచ్చుకు కారణమవుతాయి.