BigTV English

Kamalini Mukherjee : నాగార్జున సూపర్ హాట్.. హీరోయిన్ ఇలా అనేసిందేంటీ భయ్యా

Kamalini Mukherjee : నాగార్జున సూపర్ హాట్.. హీరోయిన్ ఇలా అనేసిందేంటీ భయ్యా

Kamalini Mukherjee : కమిలిని ముఖర్జీ (Kamalini Mukherjee)అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు టక్కున గుర్తుకు వచ్చే సినిమా ఆనంద్(Anand). హీరో రాజా, కమిలిని ముఖర్జీ జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఫీల్ గుడ్ మూవీ అనే చెప్పాలి. అప్పట్లో ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా తరువాత కమిలిని ముఖర్జీ తెలుగులో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె తెలుగు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. దాదాపు పది సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో కమిలిని ముఖర్జీ కనిపించడం లేదని చెప్పాలి.


షిరిడి సాయిబాబా…

ఇక ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈమె నాగార్జున(Nagarjuna)తో కలిసి పలు సినిమాలలో నటించారు. అయితే నాగార్జునకు జోడిగా హీరోయిన్ గా కాకుండా కీలక పాత్రలలో కలిసి కనిపించారు. నాగార్జున కమిలిని ముఖర్జీ కలిసి శిరిడి సాయిబాబా, జగద్గురు ఆదిశంకర సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె నాగార్జునతో నటించడం గురించి అలాగే నాగార్జున గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా కమలిని ముఖర్జీ మాట్లాడుతూ.. నాగార్జున సూపర్ హాట్ గా ఉంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


సూపర్ హాట్ గానే చూస్తాను..

నేను ఎప్పుడూ నాగార్జునను సూపర్ హాట్ గానే చూస్తాను అని చెప్పడానికి ఏమాత్రం సందేహం వ్యక్తం చేయనని తెలిపారు. అయితే ఇది సాయిబాబా అంతా హాట్ గా కాదని చెప్పడానికి తనకు కేవలం రెండు నిమిషాల సమయం మాత్రమే పడుతుందని వెల్లడించారు అయితే సినిమా షూటింగ్ సమయంలో మేమందరం కలిసి చాలా సరదాగా ఉండే వాళ్ళమని ఈ సందర్భంగా కమిలిని ముఖర్జీ నాగార్జున గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగార్జున గురించి కేవలం కమిలిని మాత్రమే కాకుండా ఇదివరకు ఎంతో మంది హీరోయిన్లు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

గోవిందుడు అందరివాడే చివరి సినిమా..

నాగార్జున ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదటిలో ఎలాగైతే ఫిట్ గా, అందంగా ఉన్నారో ఇప్పటికీ అలాగే మన్మధుడిగానే ఉన్నారనే కామెంట్లు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఇక కమిలిని ముఖర్జీ టాలీవుడ్ ఇండస్ట్రీలో చివరిగా కృష్ణ వంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన గోవిందుడు అందరివాడే సినిమాలో నటించిన సందడి చేశారు. ఈ సినిమా తర్వాత ఈమె తెలుగు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు ఇలా సినిమాలకు దూరంగా ఉన్న కమిలిని ముఖర్జీ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. అయితే ఈమెకు సరైన పాత్రలో నటించే అవకాశం వస్తే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది . మరి ఆ తరహా పాత్రలలో నటించే అవకాశాలు వస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Actor Sonu Sood:  కోట్లు విలువ చేసే ఆస్తిని అమ్మిన సోనూ సూద్… ఏమైందంటే?

Related News

Ss Rajamouli: పవన్ కళ్యాణ్ సినిమాని కామెంట్ చేసిన రాజమౌళి, వైరల్ అవుతున్న పోస్ట్

MOWGLI : మొగ్లీ సినిమా కోసం రామ్ చరణ్, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు

Manchu Manoj: సినీ ఇండస్ట్రీలో తిమింగలాలు ఉన్నాయి.. దుమారం రేపుతున్న మనోజ్ కామెంట్స్!

DUDE First Gear: డ్యూడ్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది, ఎక్సలెంట్ ఎనర్జీ

OG Film Story: ఓజి సినిమా కంప్లీట్ కథ ఇదే, హే సుజీత్ ఈ మాత్రం చాలయ్యా 

Big Stories

×