BigTV English

OTT Movie : శవం పక్కన మిస్టీరియస్ ఫోటో… థ్రిల్లింగ్ ట్విస్టులు, గ్రిప్పింగ్ నరేషన్… ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Movie : శవం పక్కన మిస్టీరియస్ ఫోటో… థ్రిల్లింగ్ ట్విస్టులు, గ్రిప్పింగ్ నరేషన్… ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Movie : థ్రిల్లర్ సినిమాలు చూడటానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఫన్ తో పాటు థ్రిల్ ఇచ్చే సినిమా ఒకటి ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాలో నలుగురు రిటైర్డ్ పర్సన్స్ ఒక మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ముసలి వయసులో వీళ్ళు చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు. ఈ సినిమా స్టోరీ చూస్తున్న కొద్దీ ఆసక్తిని పెంచుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఎలా ఉంటుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో 

‘ది థర్స్‌డే మర్డర్ క్లబ్’ (The Thursday Murder Club) 2025లో విడుదలైన అమెరికన్ క్రైమ్ కామెడీ చిత్రం. ఇది క్రిస్ కొలంబస్ దర్శకత్వంలో రిచర్డ్ ఓస్మాన్ 2020లో రాసిన ‘బెస్ట్‌సెల్లింగ్’ నవల ఆధారంగా రూపొందింది. ఇందులో హెలెన్ మిర్రెన్, పియర్స్ బ్రాస్నన్, బెన్ కింగ్స్‌లీ, సెలియా ఇమ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఆగస్ట్ 22 సినిమా హాళ్లలో విడుదలై, 2025 ఆగస్ట్ 28న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది IMDbలో 6.8/10 రేటింగ్ ని పొందింది.


కథలోకి వెళ్తే

ఎలిజబెత్, రాన్, ఇబ్రహీం, జాయిస్ అనే నలుగురు సీనియర్స్ ప్రతి గురువారం కలిసి, ఫన్ కోసం పాత మర్డర్ కేసుల గురించి థర్స్‌డే మర్డర్ క్లబ్ లో డిస్కస్ చేస్తుంటారు. ఎలిజబెత్ మాజీ స్పై, రాన్ మాజీ యూనియన్ లీడర్, ఇబ్రహీం సైకియాట్రిస్ట్, జాయిస్ ఒక నర్స్. వీళ్లంతా తమ అనుభవంతో చిన్న చిన్న కేసులు కూడా సాల్వ్ చేస్తారు. అయితే వాళ్ల విలేజ్ పెద్ద మనిషి ఒకతను స్మశాన భూమిని తవ్వి ఫ్లాట్స్ కట్టాలని ప్లాన్ చేస్తాడు. కానీ అక్కడ అతని బిజినెస్ పార్టనర్ టోనీ హఠాత్తుగా చనిపోతాడు. ఇది వీళ్లకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి మొదటి మర్డర్ కేస్ అవుతుంది.

ఈ హత్యను సాల్వ్ చేయడానికి, ఎలిజబెత్ తన స్పై కాంటాక్ట్స్, ఇబ్రహీం తన మైండ్ రీడింగ్ స్కిల్స్, రాన్ తన ధైర్యం, జాయిస్ తనకి తెలిసిన సమాచారం సేకరిస్తూ, స్థానిక పోలీసులు క్రిస్, డోనాతో కలిసి పనిచేస్తారు. కేసు ముందుకు వెళ్తుంటే, టోనీ మరణం వెనుక డబ్బు, పవర్ గేమ్ ఉందని తెలుస్తుంది. ఎలిజబెత్ భర్త స్టీఫెన్ డిమెన్షియాతో బాధపడుతూ కథకు ఎమోషనల్ టచ్ ఇస్తాడు. ఇక క్లైమాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. వీళ్లంతా ఈ మర్డర్ కేసును పరిష్కరిస్తారా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? ఈ ముసలి వయసులో వీళ్ళు ఎలాంటి రిస్క్ తీసుకుంటారు? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ క్రైమ్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : హోమ్ మంత్రి కొడుకు మిస్సింగ్స్… గరుడ పురాణంతో లింక్… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ ఉన్న కన్నడ మిస్టరీ థ్రిల్లర్

Related News

OTT: నేరుగా ఓటీటీలోకి రాబోతున్న కొత్త మూవీ.. అదిరిపోయే క్యాప్షన్!

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు .. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Netflix Top Movies: నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5 మూవీస్ ఇవే.. ట్రెండింగ్ లో ఆ మూవీ..!

OTT Movie : 1 గంట 54 నిమిషాల మిస్టరీ థ్రిల్లర్… రన్నింగ్ ట్రైన్ లో ఊహించని ట్విస్టులు… బుర్రకు పదును పెట్టే కథ

OTT Movie : ఒంటరి అమ్మాయిలతో జల్సా… ఒక్కొక్కరు ఒక్కోలా … క్లైమాక్స్ బాక్స్ బద్దలే

OTT Movie : వింత జంతువుతో అమ్మాయి సరసాలు… ఫ్రెండ్ తో కలిసి పాడు పని… ఇది అరాచకమే

OTT Movie : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా

OTT Movie : గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ… క్రిమినల్ కే సపోర్ట్… మతిపోగోట్టే ట్విస్టులున్న లీగల్ థ్రిల్లర్

Big Stories

×