Kangana Ranaut: సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఇటీవల తన రాజకీయ కార్యకలాపాలను కాస్త పక్కన పెట్టి ఈయన నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన హిస్టారికల్ పిరియాడిక్ సినిమా హరి హర వీరమల్లు జూలై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నో ఇంటర్వ్యూలకు కూడా ఈయన హాజరయ్యారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వీడియో సంచలనంగా మారింది.
ఇందిరా గాంధీ బయోపిక్ ..
ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరోయిన్ (Favourite Heroin)గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటూ పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీ లందరి పేర్లను చెప్పారు. ఇందులో ఆలియా భట్, కృతి సనన్, దీపికా పదుకొనే కంగనా రౌనత్ వంటి అందరి పేర్లు చెప్పగా తను ఎక్కువగా కంగనా రౌనత్(కంగన Raunat) పేరుని తెలియజేస్తూ వచ్చారు. ఈమె పేరు చెప్పడానికి గల కారణాన్ని కూడా ఈయన వెల్లడించారు. ఇటీవల కంగనా ఇందిరా గాంధీ బయోపిక్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారంటూ పవన్ కళ్యాణ్ తన నటనపై ప్రశంసలు కురిపించారు.
కంగన నటన పై ప్రశంసలు…
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో కంగనా రౌనత్ వరకు చేరడంతో ఆమె పవన్ కళ్యాణ్ తన గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందించడమే కాకుండా ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా రియాక్ట్ అవుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన నటనపై ప్రశంసల కురిపించడంతో కంగనా స్పందిస్తూ.. ఎంతో ఆప్యాయంగా నవ్వుతున్న ఎమోజీలతో పాటు రెండు చేతులను జోడించి నమస్కరిస్తున్న ఎమోజిని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎంపీ అభ్యర్థిగా కంగనా…
ఇకపోతే వీరిద్దరూ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో విడివిడిగా నటించారు. కానీ కలిసి సినిమా చేయలేదు వీరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు కానీ ఇది సాధ్యమయ్యే పని కాదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాజకీయ వ్యవహారాలలో ఎంతో బిజీగా ఉన్నారు. మరోవైపు కంగనా రౌనత్ కూడా రాజకీయాలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో భాగంగా ఈమె ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఎంపీగా బాధ్యతలు తీసుకున్న కంగనా సినిమాలను కూడా కాస్త తగ్గించారని చెప్పాలి. ఇక ఈమె తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.
Also Read: Film Chamber: తెలుగు ఫిలిం ఛాంబర్ కు తెలంగాణ నిరసన సెగ.. ఆంధ్రా గో బ్యాక్ అంటూ!