kannappa Collections : టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ చిత్రం కన్నప్ప.. భారీ అంచనాలతో ఇటీవలే థియేటర్లలోకి వచ్చేసింది. హీరో మంచు విష్ణుకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది. కానీ సినిమా లెవల్ ను బట్టి చూస్తే కలెక్షన్లు మాత్రం తక్కువే.. నెల 27న రిలీజ్ అయిన ఈ సినిమాకు వీకెండ్ కలెక్షన్స్ కాస్త డల్ గానే ఉన్నాయి అని తెలుస్తుంది. శుక్రవారం శనివారంతో పోలిస్తే ఆదివారం కలెక్షన్స్ మరి దారుణంగా వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మూవీ మొదటి వారం కలెక్షన్స్ ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి తెలుసుకుందాం.
‘కన్నప్ప’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..
మంచి విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరికెక్కిన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ ను అందుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం తక్కువగానే వచ్చాయి. కనీసం రెండు రోజైనా కూడా కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. తొలిరోజు రూ.9.35 కోట్లు రాబట్టిన ఈ చిత్రం శనివారం 23.53 శాతం క్షీణించి రూ.7.15 కోట్లు రాబట్టింది. దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా విడుదలైన ఈ చిత్రం తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది.. ఆదివారం టోటల్ కలెక్షన్స్ ను చూస్తే 23.5 కోట్లు వసూల్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కలెక్షన్స్ గురించి కన్నప్ప టీం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ కలెక్షన్స్ అనేవి చాలా తక్కువే..
బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..?
కొన్నేళ్లుగా మంచు విష్ణు అకౌంట్లో సరైన హిట్ సినిమా పడలేదు. ఆ మధ్య ఆడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరించినా కూడా అవి పెద్దగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. చాలా ఏళ్ల తర్వాత భారీ బడ్జెట్ తో కన్నప్ప మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మూడు రోజులు కలెక్షన్స్ తక్కువగా వచ్చాయని టాక్. ప్రతి మూవీకి వీకెండ్ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ మూవీకి దారుణంగా పడిపోయాయని తెలుస్తుంది. ఫస్ట్ వీకెండ్ లో ఆ మూవీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో వీక్ డేస్ ఎలా పర్ఫామ్ చేస్తుందోననే ఆసక్తి నెలకొంది.. ఇవాళ ఈ సినిమాకి అగ్నిపరీక్ష అని చెప్పాలి. . ఈ మూవీ బడ్జెట్ మొత్తంగా కలిపి 120 కోట్లు ఖర్చు చేశారు. 180 కోట్ల టార్గెట్ తో సినిమా థియేటర్ లోకి వచ్చింది. ప్రస్తుతం మూడు రోజులు కలిపి 25 కోట్ల లోపే వసూల్ చేసిందని తెలుస్తుంది. నేడు ఈ మూవీ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి ఈ సినిమా గట్టి ఎక్కుతుందో లేదో చెప్పవచ్చని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు.
Also Read : వామ్మో.. కుమారి ఆంటీ రేంజ్ వేరే లెవల్.. మూవీ టీంతోనే డీల్..?
ఈ మూవీని ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించారు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. మంచు విష్ణు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, ఆర్ శరత్ కుమార్, అర్పిత్ రాంకా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, శివ బాలాజీ, కౌశల్ మందా, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముఖేష్ రుషి, రఘు బాబు, మధూ తదితరులు కన్నప్పలో నటించారు.