Keerthy Suresh:కీర్తి సురేష్ (Keerthy Suresh).. ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ మేనక (Menaka)కూతురిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. ‘నేను శైలజ’ అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించి.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక తర్వాత ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ‘మహానటి’ సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోవడమే కాదు.. ఈ సినిమాతో ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది కీర్తి సురేష్. ఈ ఒక్క సినిమా ఆమెకు పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా కల్పించింది.ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ సినిమాలో గ్లామర్ పాత్ర పోషించి హద్దులు కూడా చెరిపేసింది ఈ ముద్దుగుమ్మ.
ఉప్పుకప్పురంబు ప్రమోషన్స్లో కీర్తి సురేష్..
విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ ఆకట్టుకున్న కీర్తి సురేష్.. నాని హీరోగా నటించిన దసరా (Dasara ) సినిమాలో డీ గ్లామరస్ పాత్ర పోషించి మరో విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు సుహాస్ (Suhas) హీరోగా నటిస్తున్న ‘ఉప్పుకప్పురంబు’ అనే సినిమాతో జూలై 4వ తేదీన ఏకంగా ఓటీటీలోకి రాబోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇదివరకే ట్రైలర్ విడుదల చేయగా.. ఇందులో సరికొత్త గెటప్ లో మరొకసారి అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైంది కీర్తి సురేష్. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ప్రమోషన్స్ లో పాల్గొన్న కీర్తి సురేష్ తొలిసారి తనకు నేషనల్ అవార్డు రావడం వెనుక అసలు విషయాన్ని బయటపెట్టి.. అందరిని ఆశ్చర్యపరిచింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
17 ఏళ్ల ప్రాయంలోనే ప్రేమలో పడ్డ కీర్తి సురేష్..
ఉప్పుకప్పురంబు ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ (Anchor Suma) తో చేసిన ఇంటర్వ్యూలో తన ప్రేమ విషయాన్ని కూడా బయట పెట్టింది. మొదట ఇంటర్వ్యూలో భాగంగా “మీ భర్తతో ఎన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు?” అని సుమా ప్రశ్నించగా.. కీర్తి సురేష్ మాట్లాడుతూ.. “నా భర్త ఆంటోనీ తట్టిల్ (Antony Thattil) తో నేను ఇంటర్లో ఉన్నప్పుడే లవ్ లో పడ్డాను. అప్పుడు నా వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. అప్పటినుంచి మా ప్రేమ బలపడింది. అలా 15 సంవత్సరాల పాటు మేము ప్రేమించుకున్నాము. ఇక పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. అన్ని విషయాలలో నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు” అంటూ తెలిపింది.
నేషనల్ అవార్డు ఆయన వల్లే సాధ్యం – కీర్తి సురేష్
కీర్తి సురేష్ ఇంకా మాట్లాడుతూ.. “ఇప్పటివరకు సినిమాలలో ఎలాంటి ప్రెజర్ లేకుండా నటించాను అంటే దానికి కారణం నా భర్త సపోర్టు. ఒకరకంగా చెప్పాలి అంటే మహానటి సినిమాలో కూడా నేను అంత అద్భుతంగా నటించడానికి కారణం నా భర్త ఇచ్చిన సపోర్ట్. ఇక అందుకే ఆ నేషనల్ అవార్డు కూడా ఆయన వల్లే సాధ్యమైంది” అంటూ చెప్పకనే చెప్పింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే భర్త ఇచ్చిన సపోర్ట్ తోనే అన్ని సినిమాలలో చాలా అద్భుతంగా ఒత్తిడి లేకుండా నటించగలుగుతున్నాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది కీర్తి సురేష్.
పెళ్లి తర్వాత సినిమాలపై క్లారిటీ..
ఇక అలాగే పెళ్లి తర్వాత సినిమాలలో నటించడంపై కూడా ఆమె మాట్లాడుతూ.. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను సినిమాలలో నటిస్తానంటే ఆయన నో చెప్పలేదు. నేను ఎప్పుడు ఎలా ఉండాలో అది పూర్తిగా నా ఇష్టం. నా విషయంలో ఏ రోజు కూడా నన్ను ఇబ్బంది పెట్టడు అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. మొత్తానికైతే దాంపత్య జీవితంలో తాను మరింత సంతోషంగా ఉన్నానని చెప్పి అభిమానులను సంతోషపరిచింది.
ALSO READ:Polimera 3 Heroine: ఆల్రెడీ చచ్చిన దాన్ని మళ్ళీ హీరోయిన్ అంటారేంట్రా.. మైండ్ దొబ్బిందా ఏంటి!