Polimera 3 Heroine:’మా ఊరి పొలిమేర’.. 2021 లో మిస్టీరియస్ మర్డర్, సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ పై భోగేంద్ర గుప్తా నిర్మించిన ఈ సినిమాకి డాక్టర్ అనిల్ విశ్వనాథ్ (Dr.Anil Vishwanath) దర్శకత్వం వహించారు. సత్యం రాజేష్ (Sathyam Rajesh) , కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) , బాలాదిత్య (Baladithya ), గెటప్ శ్రీను(Getup Sreenu), రవివర్మ (Ravi Varma ), చిత్రం శ్రీను (Chitram Srinu) వంటి వారు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో 2021 డిసెంబర్ 10న విడుదలై ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.
థియేటర్లలో సంచలనం సృష్టించిన మా ఊరి పొలిమేర 2..
ఓటీటీలో ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ లభించడంతో ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘మా ఊరి పొలిమేర 2’ పేరుతో 2023లో ఈసారి థియేటర్లలో విడుదల చేశారు. గౌరు గణబాబు సమర్పణలో శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరీ కృష్ణ నిర్మించిన ఈ సినిమాకి డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఇక అలాగే పొలిమేర సినిమాలో ఉండే భారీతారాగణం అంతా కూడా కంటిన్యూ అవుతూ వచ్చిన ఈ సినిమా 2023 నవంబర్ 3న థియేటర్లలో విడుదల చేయగా.. అక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. డిసెంబర్ 8 నుంచి ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కేవలం రూ.3కోట్ల బడ్జెట్ తో తీస్తే ఏకంగా రూ.15 కోట్లు వసూలు చేసింది. చిన్న సినిమానే అయినా అదిరిపోయే ట్విస్ట్ లతో, థ్రిల్లింగ్ అంశాలతో ఆడియన్స్ ను విపరీతంగా మెప్పించింది.
‘మా ఊరి పొలిమేర 3’ లో కూడా హీరోయిన్ గా ఆమె..
ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘మా ఊరి పొలిమేర 3’ కూడా రాబోతున్న విషయం తెలిసిందే. స్క్రిప్ట్ వర్క్ తోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయి.. దాదాపు షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే అంతలోనే ఇప్పుడు మరొక వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పొలిమేర సినిమాలో లచిమి పాత్రలో నటించిన కామాక్షి.. పొలిమేర 3 లో కూడా హీరోయిన్గా చేస్తోందనే ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది.
చచ్చింది మళ్లీ హీరోయిన్ ఏంట్రా అంటూ నెటిజన్స్ కామెంట్స్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఇదివరకే పొలిమేర సినిమాలో కొమిరికి అన్నంలో విషం పెట్టి చంపినట్టు చూపించారు. ఇక పొలిమేర 2 లో ఈమెను ఎవరో కాల్చి చంపారు.అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. పొలిమేర 3లో కూడా మళ్లీ ఈమె హీరోయిన్ అనేసరికి.. ఆల్రెడీ చచ్చిన దాన్ని మళ్లీ హీరోయిన్ అంటారేంట్రా? మైండ్ గాని దొబ్బిందా ఏంటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఇకపోతే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది విన్న కొంతమంది పలు రకాలుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చచ్చిన వాళ్లు సినిమాల్లో దెయ్యం అవుతారు అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే.. మరొకరు కొమిరి కూడా పార్ట్ వన్ లో చనిపోతాడు.. కానీ పార్ట్ 2 లో మళ్ళీ తిరిగి వచ్చాడు కదా.. ఇది కూడా అంతే అంటూ కామెంట్ చేశారు. ఇంకొక నెటిజన్ ఏమో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉన్నాయేమో అంటూ ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
హీరోయిన్ గానే కాదు రైటర్, కో డైరెక్టర్ కూడా..
అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పొలిమేర 3 సినిమాలో కామాక్షి హీరోయిన్ గానే కాకుండా రైటర్ , కో డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నట్లు సమాచారం.
ALSO READ:Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. గబ్బర్ సింగ్ నటుడు మృతి!