BigTV English

Kumari Aunty : వామ్మో.. కుమారి ఆంటీ రేంజ్ వేరే లెవల్.. మూవీ టీంతోనే డీల్..?

Kumari Aunty : వామ్మో.. కుమారి ఆంటీ రేంజ్ వేరే లెవల్.. మూవీ టీంతోనే డీల్..?

Kumari Aunty : కుమారి ఆంటీ.. ఈ పేరు సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ట్రెండ్ అవుతుంది.. ఆమె చెప్పిన రెండు లివర్లు ఫ్రీ అనే డైలాగ్ ఇప్పటికీ రీల్స్ రూపంలో వినిపిస్తూనే ఉంది. చివరకు సీఎం దృష్టి వరకు తీసుకు వెళ్లారు. ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని ఆమె ఫుడ్ స్టాల్‌ను అధికారులు తీసేస్తే మళ్లీ సీఎం స్పందించే వరకు సోషల్ మీడియా విడిచి పెట్టలేదు.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లను మించి ఫాలోయింగ్ కుమారి ఆంటీ కి ఉందన్న విషయంలో సందేహం లేదు.. ఇకముందు బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాల్టీ షోలు షోలలో కనిపించిన ఆశ్చర్యపోనవసరం లేదు.. అయితే తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అదేంటంటే.. మూవీ టీం తో కుమారి ఆంటీ డీల్ ఫిక్స్ చేసుకుందట. అందులో నిజం ఎంత ఉందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


కుమారీ ఆంటీతో మూవీ ప్రమోషన్..?

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర డిఫరెంట్ కంటెంట్లతో సినిమాలు తీస్తున్న కూడా ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటున్నాయి. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా ఓటిటిలో మాత్రం పర్వాలేదనే టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. జూన్ నెలలో అయితే ఒకే రోజు మూడు చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. ఇక ఇప్పుడు మళ్లీ జూలైలో షో టైం అని ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. జూలై 4న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. తన సినిమాకు టాక్ బాగుందని తెలిసే లోపు థియేటర్లోంచి వెళ్లిపోతోందని భావించిన నవీన్ చంద్ర ఈసారి ప్రమోషన్స్ ని కొత్తగా చేయాలని ఆలోచించినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ మూవీని థియేటర్లలో జనాలు మిస్ అవ్వకూడదని కుమారి ఆంటీ తో ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు. ఆల్రెడీ ఈమె బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు షోలలో సందడి చేసింది. బుల్లితెరపై కూడా ఈమెకు క్రేజ్ ఎక్కువగానే ఉందని చెప్పాలి. కుమారీ ఆంటీ క్రేజ్‌ను వాడుకున్నారు. షో టైం మూవీ టీం కుమారీ ఆంటీని తీసుకు వచ్చి ప్రమోషనల్ ఇంటర్వ్యూ తీసుకున్నారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఈమధ్య కుమారి ఆంటీ పెద్దగా కనిపించలేదు. అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించింది. తర్వాత ఇన్నాళ్లకు మళ్ళీ ఈ సినిమా ప్రమోషన్స్ లో మెరిసింది. మొత్తానికి అయితే ఆమెను సెలబ్రిటీని చేసేసారు. ఇప్పుడు సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు కూడా చేసేస్తున్నారు. కుమారి ఆంటీ క్రేజ్ చూస్తుంటే ఇలానే సినిమాల్లో కారెక్టర్లు చేసే స్థాయికి కూడా వెళ్లేలా ఉంది. మరి ఇలా కుమారి ఆంటీ ఫుల్ బిజీ అవుతుంటే.. తన ఫుడ్ బిజినెస్ షెడ్డుకు వెళ్తుందేమో. ఇప్పటికే కుమారి ఆంటీ ఫుడ్ మీద చాలా వరకు విమర్శలు వచ్చేశాయి. ఫుడ్ బాగోలేదని కూడా ఒకవైపు టాక్ వినిపిస్తుంది. కొందరేమో ఈమెకు ఇలాంటి ప్రమోషన్స్ వల్ల మంచి క్రేజ్ వస్తుంది ఫుడ్ బిజినెస్ పోతే పోయింది అని కామెంట్లో పెడుతున్నారు. ఏది ఏమైనా కూడా కుమారి ఆంటీ అతి తక్కువ కాలంలోనే ఇలా సినిమాలకు ప్రమోషన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదని నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read : టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్.. రూ. 600 కోట్ల నష్టం..సెకండాఫ్ పైనే ఆశలు..

షో టైం మూవీ విషయానికొస్తే.. 

హీరో నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల, నరేష్, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించిన ఈ షో టైం చిత్రాన్ని మధన్ కుమార్ తెరకెక్కించారు. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్‌పై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మించారు.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు…

Related News

Pawan Kalyan: ఓకే నెలలో 3 పవన్ కళ్యాణ్ సినిమాలు, ఓజీ ముందు అవసరమా? 

Little Hearts: అనుష్క ‘ఘాటీ’కి పోటీగా చిన్న సినిమా.. వారం ముందుగానే థియేటర్లలోకి, కొత్త రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే!

OG Movie : ‘ఓజీ’ నుంచి వినాయక చవితి సర్ ప్రైజ్ రెడీ.. ఫ్యాన్స్ కు పూనకాలు పక్కా..!

SSMB 29: రాజమౌళి సినిమాలన్నింటికీ మించిన సీన్!

Actor Naresh : నరేష్ – పవిత్రల కొత్త ఇల్లు చూశారా..? ఇంద్రభవనమే..

Samantha : డైరెక్టర్ గా సమంత.. హీరోయిన్ గా ఇక చేయనట్లేనా..?

Big Stories

×