Kannappa Movie: మంచు మోహన్ బాబు (Mohan Babu)నిర్మాణ సారధ్యంలో.. మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం కన్నప్ప (Kannapap). దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్తో.. న్యూజిలాండ్ లోని 7000 ఎకరాలలో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేయడం జరిగింది. ఒక్కొక్క ఇండస్ట్రీ నుండి ఒక్కో స్టార్ ను రంగంలోకి దింపుతూ పాన్ ఇండియా మూవీగా విడుదల చేశారు. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఒక వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నా.. మాక్సిమం ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్లు వచ్చాయని చెప్పవచ్చు.
వైరల్ గా మారిన నెటిజన్ ట్వీట్..
ముఖ్యంగా ఈ సినిమాను ‘భక్త కన్నప్ప’ సినిమాతో పోల్చుతూ.. దీనికంటే అదే బెటర్ గా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలైన దగ్గర్నుండి ఏదో ఒక షార్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాలోని మరో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
గిరిజన గూడెంలో న్యూజిలాండ్ గర్ల్స్..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రీతి ముకుందన్ గిరిజన గూడెంలో నివసించే గిరిజన అమ్మాయిగా నటించింది. ఈమె తో పాటూ మరికొంతమంది గిరిజన అమ్మాయిల పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక షార్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.. తాజాగా ఒక నెటిజన్ సోషల్ మీడియా ద్వారా ఆ షార్ట్ కి చెందిన ఫోటోను షేర్ చేస్తూ.. గిరిజన గూడెంలో న్యూజిలాండ్ గర్ల్స్ ను పెట్టారేంట్రా అంటూ ఒక ట్వీట్ షేర్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్, ఆడియన్స్ గిరిజన గూడెంలో న్యూజిలాండ్ గర్ల్స్ కి ఏం పని అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఇదేమైనా హాలీవుడ్ మూవీనా గిరిజన గూడెంలో న్యూజిలాండ్ గర్ల్స్ ని పెట్టారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు విష్ణు..
ఇకపోతే దీన్ని బట్టి చూస్తే మంచు విష్ణు ఇంత చిన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యాడు అని అభిమానులు కూడా ఫైర్ అవుతూ ఉండడం గమనార్హం. నిజానికి చాలా పగడ్బందీగా దాదాపు రెండు సంవత్సరాలు పైగా భారీ శ్రమతో సినిమాను రూపొందించారు. సినిమా కోసమే ప్రాణం పెట్టామంటున్న వీరు ఇంత చిన్న లాజిక్ లు ఎలా మిస్ అయ్యారు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ఇది ఇంగ్లీష్ మూవీలాగా ఉందే అంటూ ట్రోల్స్..
దీనికి తోడు ఈ సినిమాల్లో మంచు విష్ణు కొడుకు అవ్రామ్ కూడా నటించారు. అయితే ఈ పిల్లాడు కూడా ఇంగ్లీష్ యాగ్జెంట్ లో మాట్లాడాడు. దీనికి తోడు ఇదే సినిమాలో మంచు విష్ణు కూతుర్లు అరియానా, వివియానా కూడా నటించారు. వీరిద్దరూ నృత్య ప్రదర్శన చేస్తున్న సమయంలో కూడా ఇలా ఇంగ్లీష్ భాషని పాట లోకి తీసుకురావడం ఆశ్చర్యంగా మారింది. వీటన్నింటినీ చూసి.. ఇది కన్నప్ప మూవీ కాదు ఇంగ్లీషు సినిమా లాగా ఉందే అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీనిపై మంచి విష్ణు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
ALSO READ:Keerthy Suresh: నేషనల్ అవార్డు వెనుక ఆయన హస్తం ఉందా.. ఇన్నాళ్లకు బయటపెట్టిన మహానటి!
Eella gudem lo newzealand girls unnarenti 😭😭😭 pic.twitter.com/3XdRNq4yKr
— Wise Chimp (@uncle_iroh7) June 29, 2025