పెరుగుతున్న కాలుష్యం కారణంగా తక్కువ వయసులోనే ఎంతోమంది పెద్ద వయసు వారిలా కనిపిస్తున్నారు. ముఖంలో తాజాదనం, మెరుపు కోల్పోయి కాంతి విహీనంగా అయిపోతున్నారు. అలాంటివారు ప్రతిరోజు నీరు తాగడం ద్వారా చర్మకాంతిని పెంచుకోవచ్చు. అలా అని ఎలా పడితే అలా నీరు తాగితే కుదరదు. ఇక్కడ వైద్యులు చెప్పినట్టు నీటిని తాగాలి. కేవలం నీరు తాగితే అందంగా మారిపోతారు అనుకోకండి. మీరు తాగడంతో పాటు పండ్లు, తాజా కూరగాయలు తీసుకుంటూ ఉండాలి.
ఆరోగ్య నిపుణులైన డాక్టర్ మదన్ మోడీ తన ఇన్‌స్టాగ్రామ్ లో నీటికి సంబంధించి నాలుగు నియమాలను చెప్పారు. ఈ నాలుగు నియమాలను పాటిస్తూ నీరు తాగితే వయస్సు పెరిగినా కూడా చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తుందని ఆయన చెబుతున్నారు 40 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల కుర్రాడిలా మెరిసిపోవాలంటే మీరు ఎలా తాగాలో తెలుసుకోండి.
నీటితో ప్రారంభించండి
మీరు ఉదయం నిద్ర లేవగానే గ్లాసు నీరు తాగాలని డాక్టర్ మోడీ చెబుతున్నారు. ఇది శరీరాన్ని డిటాక్సిషికేషన్ చేస్తుంది. అలాగే నిద్రలో నెమ్మదిగా మారిన జీవక్రియను మళ్ళీ వేగవంతం చేస్తుంది. ఉదయానే తాగే నీరు మీ కాలేయం, మూత్రపిండాలు, చర్మాన్ని కూడా రిఫ్రెష్ చేస్తుంది. ఇది మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. మీకు కావాలంటే చల్లని నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని తాగవచ్చు. గోరువెచ్చని నీరు పొట్టకూ, చర్మానికి రెండిటికి ఎంతో మేలు చేస్తుంది.
సిప్ చేయండి
నీళ్లు తాగమంటే చాలామంది గటగటా తాగేస్తారు. అలా తాగడం వల్ల ఉపయోగం ఉండదు. గ్లాసు నీటిని ఒకేసారి తాగే బదులు టీ తాగినట్టు నీటిని సిప్ చేస్తూ ఆస్వాదిస్తూ తాగాలి. దీనివల్ల పొట్టలోకి ఎక్కువ లాలాజలం వెళ్లి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మైగ్రేషన్, తలనొప్పి వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. చెవులు, ముక్కు, గొంతు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా నీళ్లు తాగడం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సహజ వ్యాయామంలాగా అనిపిస్తుంది. కాబట్టి నీటిని గటగటా తాగే బదులు కాసేపు కూర్చొని ప్రశాంతంగా సిప్ చేస్తూ తాగండి.
చల్లటి నీరు వద్దు
వేసవిలో కూడా చల్లటి నీరు తాగితే హాయిగా అనిపిస్తుంది. వాతావరణం ఎంత వేడిగా ఉన్నా, గొంతు ఎండిపోయినా ఫ్రిజ్లోని చల్లని నీటిని తాగకూడదని చెబుతున్నారు. వైద్యులు చల్లని నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు షాక్ కొట్టినట్టు అవుతుంది. దీనివల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. కావాలంటే మట్టికుండలోనా నీటిని తాగవచ్చు. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.
భోజనానికి ముందు తర్వాత
భోజనం తినడానికి ముందు లేదా ఆ తర్వాత వెంటనే నీటిని తాగే అలవాటును మానుకోవాలని చెబుతున్నారు. డాక్టర్ మోడీ భోజనం తినడానికి ముందు లేదా తర్వాత నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ బలహీనపడుతుందని, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు. తినడానికి అరగంట ముందు, తిన్న అరగంట తర్వాత మాత్రమే నీరు తాగాలి. అలాగే నీరు ఎప్పుడు నిలబడి తాగకూడదు.. కూర్చునే నీరు తాగాలి. భోజనం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో అవసరమైతే పెరుగు తీసుకోండి. కానీ మీరు ఎక్కువగా తాగవద్దని చెబుతున్నారు. వైద్యులు ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా సాగుతుందని వివరిస్తున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ పైన చెప్పిన పద్ధతిలో నీటిని తాగితే ఎవరైనా కూడా 40 ఏళ్ల వయసులో పాతికేళ్ళ యువకుడిలా మెరిసిపోతారని, ముఖంపై మెరుపు వస్తుందని వివరిస్తున్నారు. అలాగే ఎన్నో సమస్యలు ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు అని చెబుతున్నారు.