Industrial Estate: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు చోటు చేసుకుంది. సిగాచీ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మంటలు అదుపులోకి వస్తే లోపల ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సివుంది.
సోమవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ కెమికల్ పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. రియాక్టర్ పేలిన భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్లు దూరం ఎగిరిపడ్డారు.
రియాక్టర్ పేలుడు దాటికి ఉత్పత్తి చేస్తున్న భవనం కుప్పకూలింది. మరో భవనానికి బీటలు భారీగా బీటలు వచ్చాయి. క్వాలిటీ కంట్రోల్ భవనంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ రెండు భవనాల్లో సుమారు 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మరికొందరు లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
మంటలకు కొందరికి శరీరాలు కలిపోగా, కొందరికి చేతులు, ఇంకొందరికి కాళ్లు విరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 20 మంది కార్మికులను వెంటనే అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఐదురుగు మృత్యువాత పడగా, ఆసుపత్రిలో మరొకరు మరణించారు.
ALSO READ: మహాలక్ష్మి కళ్లలో ఆనందం.. అకౌంట్లు చెక్ చేసుకోండి
ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే 11 ఫైరింజన్లు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఘటన జరిగిన ఆ ప్రాంతంలో ఎంతమంది కార్మికులు ఉన్నారనేది తెలియాల్సివుంది.
మార్నింగ్ షిప్ట్‌కు వచ్చిన కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు చెబుతున్నారు. కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో చుట్టు పక్కల పరిసరాలకు ఘాటైన వాసనలు వ్యాపించాయి. ఆ వాసనతో చుట్టు పక్కల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఘటన స్థలంలో ఐదుగురు, ఆసుపత్రిలో మరొకరు మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
బాధితులు ప్రస్తుతం చందానగర్, ఇస్నాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటన గురించి తెలియగానే సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీలు అక్కడికి చేరుకున్నారు. జరుగుతున్న సహాయక చర్యలపై వివరాలు సేకరించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఘటనా సమయంలో 100 నుంచి 120 మంది కార్మికులు లోపల ఉన్నట్టు సమాచారం.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీగా ఎగసిపడుతున్న మంటలు
పేలుడు ధాటికి ఎగిరిపడిన కార్మికులు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 20 మంది కార్మికులు
పలువురి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు
మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక… pic.twitter.com/w5GBAUkY9e
— BIG TV Breaking News (@bigtvtelugu) June 30, 2025