E-Paper
Advertisement

Kannappa collections : ‘కన్నప్ప’ షాకింగ్ వసూళ్లు.. మళ్లీ నిరాశ తప్పలేదా..?

Kannappa collections : ‘కన్నప్ప’ షాకింగ్ వసూళ్లు.. మళ్లీ నిరాశ తప్పలేదా..?

Kannappa collections : టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్ర లో నడిచిన తాజా చిత్రం కన్నప్ప.. హిందీ మహాభారతం సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.. ఈ మూవీలో  బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మలయాళ హీరో మోహన్ లాల్, పాన్ ఇండియా హీరో ప్రభాస్, మోహన్ బాబు, టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. భారీ అంచనాలతో ఈ మూవీ జూన్ 27వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. ఒకవైపు పాజిటివ్ టాక్ ని అందుకున్న మరోవైపు ఈ సినిమాపై విమర్శలు ఆగడం లేదు. రిలీజ్ అయ్యి నాలుగు రోజులు పూర్తయిన కూడా సినిమా పై ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ మూవీ ఫోర్ డేస్ కలెక్షన్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా.లో చక్కర్లు కొడుతుంది. నాలుగు రోజులకు గాను కన్నప్ప ఎన్ని కోట్లు వసూల్ చేసిందో చూద్దాం..

‘కన్నప్ప’ 4 డేస్ కలెక్షన్స్..

మంచు విష్ణు ప్రధాన పాత్ర లో నటించిన మూవీ కన్నప్ప రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి షో కాస్త ప్రేక్షకుల మనసు దోచుకుంది. దాంతో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూస్తే మూవీకి నష్టాలు తప్పేలా కనిపించలేదు. మూడు రోజుల గాను 23 కోట్ల వరకు వసూలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కనపడి మాత్రం ఎక్కడా అధికారికంగా ధ్రువీకరించలేదు. అదేవిధంగా నాలుగో రోజు కూడా కలెక్షన్లు వసూలు చేస్తుందని తెలుస్తుంది.. ప్రపంచవ్యాప్తంగా నాలుగో రోజు 28 నుంచి 31 కోట్ల వరకు వసూలు చేసి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. కలెక్షన్స్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Also Read: మంగళవారం టీవీల్లో రాబోతున్న సినిమాలు.. ఆ రెండు స్పెషల్ డోంట్ మిస్..

‘కన్నప్ప’ మూవీ పై ఆశలు వదులుకోవాల్సిందేనా..? 

ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.86 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.87 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.18.27 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.33 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.68.73 కోట్ల షేర్ ను రాబట్టాలి. టోటల్గా 180 కోట్ల టార్గెట్ తో సినిమా థియేటర్ లోకి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. ఇన్నాళ్ల తర్వాత విష్ణు ఖాతాలో హిట్ సినిమా అయితే పడింది కానీ.. అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఇక మరో వారానికి కలెక్షన్స్ ఏమైనా పెరుగుతాయేమో… ఈ నెలలో కూడా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుందేమో చూడాలి..

Related News

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

Big Stories

×