Singer Sravanabhargavi: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా విడాకులు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలామంది సినీ తారులు విడాకులు తీసుకుని వేరొకరితో రిలేషన్ లో ఉంటున్నారు. నిన్న కాక మొన్న తమిళ స్టార్ హీరో జయం రవి ఆయన భార్య ఆర్తితో విడాకులు ప్రకటించాడు. స్టార్ హీరోలు సైతం ఇలా భార్యలతో విడాకులు తీసుకోవడంపై సర్వత్ర చర్చలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏ స్టార్ హీరో లేదా స్టార్ హీరోయిన్ విడాకులు ప్రకటిస్తుందోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.. మరికొందరేమో తమ భాగస్వామితో విడివిడిగా ఉంటున్నా కూడా ఆ విషయాన్ని బయట పెట్టకుండా దాచేస్తున్నారు. సడన్గా సోషల్ మీడియా ద్వారా మేము ఇద్దరము విడిపోయమంటూ ఒక పోస్ట్ తో షాకిస్తున్నారు.. తాజాగా టాలీవుడ్ స్టార్ సింగర్ శ్రావణ భార్గవి కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
శ్రావణ భార్గవి పోస్ట్ లో ఏముందంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్స్ సినిమాలకు తమ గొంతును అందించిన స్టార్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ్ భార్గవిలు తెలుగు తో పాటు తమిళ్, కన్నడ సినిమాలలో ఒక ఊపు ఊపారు. ఇక తన స్నేహితుడు, మరో సింగర్ హేమచంద్రతో ప్రేమలో పడిన శ్రావణ భార్గవి 2013లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఆ బంధం కాస్త మూడు నాలుగు ముచ్చటగానే మారింది. ఈ దంపతుల దాంపత్య జీవితానికి గుర్తుగా ఒక పాప పుట్టింది. అసలు ఏమైందో తెలియకుండానే వాళ్ళిద్దరూ విడిపోయినట్లు గతంలో సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.. ప్రస్తుతం శ్రావణ భార్గవి తన కూతురితో కలిసి తన పుట్టింట్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఈమధ్య ఈ సింగర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కూతురితోను తల్లితోనూ రీల్స్ చేస్తుంది తప్ప ఆమె చేస్తున్న వీడియోలు హేమచంద్ర ఎక్కడా కనిపించలేదు. దాంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అనే వార్తలు. ఇక ఇన్నాళ్ల తర్వాత శ్రావణ భార్గవి పెట్టిన పోస్టు నెట్టింట హల్ చల్ చేస్తుంది..
ఆ పోస్టులో ఏముందంటే..
లైఫ్ చాలా సున్నితమైనది.. అవసరాలు, అపార్ధాలు, చిక్కుముళ్లు, వివాదాలు, గొడవలు.. వీటితోనే బతికేయడంలో అర్ధం లేదన్నారు. ప్రేమ మాత్రమే అర్ధవంతమైనది.. మనం ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు ..వారిని ఎక్కువగా ప్రేమించడానికే చూడాలి.. జీవితంలో మనం గెలిచామో..? ఓడామో అన్నది అదే డిసైడ్ చేస్తుందని శ్రావణ భార్గవి రాసుకొచ్చారు. ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చినీయాంశంగా మారింది. ఈ పోస్టు హేమచంద్ర కోసమే పెట్టిందా? లేదా వీళ్ళిద్దరూ విడిపోయినట్లు హింట్ ఇచ్చిన అర్థం కావట్లేదు కానీ ప్రస్తుతం అయితే ఈమె పేరు వార్తల్లో హైలైట్ అవుతుంది. మరి దీనిపై శ్రావణ భార్గవి క్లారిటీ ఇస్తుందేమో వెయిట్ చెయ్యాలి..
Also Read : ‘కన్నప్ప’ షాకింగ్ వసూళ్లు.. మళ్లీ నిరాశ తప్పలేదా..?
శ్రావణ భార్గవి, హేమచంద్ర హోస్ట్ చేసిన షోలు..
టాలీవుడ్ సింగర్స్ అయినా శ్రావణ భార్గవి హేమచంద్ర ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్ లలో వీళ్ళు కూడా ఉన్నారు. పెళ్లికి ముందు ఎలా కలిసి పాటలు పాడారో పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ జంటగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పాలు షోలలో కనిపించారు.. ఎన్నో ప్రోగ్రామ్లలో పాటలు పడి ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ మధ్య ఈ జంట ఎక్కడ కనిపించలేదు. శ్రావణ భార్గవి మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కూతురు గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేస్తుంది. కానీ హేమచంద్ర మాత్రం అసలు ఉన్నాడా? లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. ఏది ఏమైనా కూడా ఈ జంట విడిపోయారన్న వార్త కొందరికి మింగుడు పడడం లేదు. మరి వీరిద్దరూ విడిపోయారా? మనస్పర్ధలు కారణంగా దూరంగా ఉంటున్నారా? ఇంకేదైనా కుటుంబ సమస్యలు ఉన్నాయా? లేదా మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాలంటే శ్రావణ భార్గవి లేదా హేమచంద్ర స్పందించి క్లారిటీ ఇవ్వాల్సిందే..