Kantara Chapter1: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty)హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకుగాను ఏకంగా నేషనల్ అవార్డు కూడా వరించింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు ఫ్రీక్వెల్ సినిమాగా కాంతార చాప్టర్ 1 (Kantara Chapter1)త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 2 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ట్రైలర్ విడుదల చేయడానికి హోంభళే నిర్మాణ సంస్థ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 :45 గంటలకు తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి బడా హీరోలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ఇక తెలుగులో ఈ సినిమా ట్రైలర్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) చేతుల మీదుగా విడుదల కాబోతున్నట్లు ఇటీవల నిర్మాణ సంస్థ అధికారకంగా ప్రకటించారు.
రంగంలోకి నలుగురు స్టార్ హీరోలు..
ఇలా ప్రభాస్ చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతుందనే విషయం తెలియగానే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఇక ప్రభాస్ తో పాటు హిందీలో ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. అలాగే తమిళంలో శివ కార్తికేయన్(Siva Karthikeyan) ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఇక మలయాళంలో కూడా మరొక స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Pruthivi Raj Sukumaran) ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయనున్నట్లు హోంభళే నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించారు. ఇలా కాంతారా చాప్టర్ 1 కోసం బడా హీరోలు అందరూ రంగంలోకి దిగిన నేపథ్యంలో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
When the roar of a Legend unites with the power of a Rebel Star 🔥
The Telugu Trailer of #KantaraChapter1 will be launched by the iconic Rebel Star #Prabhas.More legends. More languages.
One roar echoes across the world. Stay tuned!#KantaraChapter1Trailer on September 22nd… pic.twitter.com/ln73waQBnk
— Hombale Films (@hombalefilms) September 20, 2025
ఇక ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడం విశేషం. రిషబ్ శెట్టి రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా భూతకోల నృత్య ప్రదర్శన నేపథ్యంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్ ప్రకటన గురించి చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ కూడా వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా రిషబ్ శెట్టి డప్పుకొడుతూ ఉండడంతో ఈసారి సినిమా కూడా కలెక్షన్ల మోత మోగిస్తుందని ఈ పోస్ట్ ద్వారా నిర్మాతలు చెప్పకనే చెప్పేశారు. కాంతార సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న రిషబ్ శెట్టి మరి ఈ సినిమాతో ఎలాంటి అవార్డులను సొంతం చేసుకుంటారో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?