BigTV English

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video:

న్యూఢిల్లీ సహా పరిసర నగరాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం రాత్రి సమయంలో ఆకాశంలో అరుదైన వెలుగులు రావడం చూసి షాకయ్యారు. అచ్చం ఉల్కాపాతం మాదిరి వెలుగుల కనిపించినా, అవేంటో తెలియక అయోమయానికి గురయ్యారు. విస్మయానికి లోనయ్యారు. పలువురు ఈ దృశ్యాలను సెల్ ఫోన్లలో షూట్ చూసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మిరుమిట్లు గొలిపే కాంతి రేఖ కాసేపటి తర్వాత గాల్లోనే మాయం అయ్యింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్, అలీఘర్ లో ఈ దృశ్యాలు కనిపించాయి.


సోషల్ మీడియాలో జోరుగా చర్చ

చాలా మంది ఈ వీడియోలను షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదో అద్భుతమైన ఉల్కాపాతంగా అభివర్ణించారు. కొంత మంది ఈ దృశ్యాలను మిస్సైల్స్ అని భయపడ్డారు కూడా. రాత్రి వేళలలో ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. ఈ వెలుగులపై రకరకాల చర్చలు జరిగాయి. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అయ్యారు. అయితే, ఈ వెలుగులపై ఆ తర్వాత ఖగోళశాస్త్రవేత్తలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఉల్కాపాతం అని వెల్లడించిన శాస్త్రవేత్తలు

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఖగోళశాస్త్రవేత్తలు స్పందించారు. దీనిని అరుదైన ఉల్కాపాతంగా అభివర్ణించారు. తీవ్రమైన ఘర్షణ, వేడి కారణంగా భూమి వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత ముక్కలుగా విడిపోయే ఒక రకమైన ఉల్కాపాతం అన్నారు. ఉల్కలు అసాధారణం కాకపోయినా, అంత పెద్ద సంఖ్యలో ప్రజలకు కనిపించేలా ప్రకాశవంతగా భూమి వైపు దూసుకురావడం అనేది అత్యంత అరుదైన ఘటన అన్నారు. చాలా ఉల్కలు భూమిని చేరుకునే ముందు విచ్ఛిన్నమవుతాయని, అందుకే ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదన్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.


Read Also:  ఒకే వ్యక్తితో తల్లి, కూతురు సంబంధం.. ఒకేసారి గర్భం కూడా, ఛీ పాడు!

ముందుగానే అంచనా వేసిన అమెరికా పరిశోధకులు

అటు అమెరికన్ ఉల్కాపాతం సొసైటీ సెప్టెంబర్ నెలలో చిన్న ఉల్కాపాతాలు సంభవిస్తాయని గతంలోనే ప్రకటించింది. ఈ అంచనా ప్రచారం ఫైర్‌ బాల్ లాంటి ఉల్కలు కనిపిస్తాయన్నారు. అంచనాలకు తగినట్లుగానే ఢిల్లీలో అరుదైన ఉల్కాపాతం కనిపించింది. అత్యంత ప్రకాశవంతమైన ఈ వెలుగులు అంతరిక్షం నుంచి ఒక పెద్ద శిల కాలిపోతూ కింద పడుతున్నట్లు కనిపించింది. ఢిల్లీ NCR అంతటా ఫ్లాష్ కొన్ని సెకన్ల పాటు ఈ ఉల్కాపాతం కనిపించినట్లు ప్రజలు వెల్లడించారు. నగరంలోని లైట్లు అన్నింటినీ మించిన కాంతితో ఈ ఉల్కాపాతం జరిగినట్లు చెప్పారు. కొద్ది సెకెన్ల తర్వాత రంబుల్ సౌండ్ విన్నట్లు తెలిపారు. అయితే, ఈ శబ్దానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, స్కై వాచర్లు ఈ దృశ్యాన్ని జీవితంలో ఒకసారి జరిగే అద్భుతమైన అంతరిక్ష దృశ్యంగా అభివర్ణించారు. మొత్తంగా ఈ అద్భుత దృశ్యాలు ఢిల్లీ పరిసర రాష్ట్రాల ప్రజలను భయంతో పాటు ఆశ్చర్యానికి గురి చేశాయి.

Read Also: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Related News

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Viral Video: నడి రోడ్డుపై భర్తను ఉతికి ఆరేసిన భార్య.. పెళ్లికాని ప్రసాదులు మీరు చాలా లక్కీ!

Viral News: పానీ పూరీల కోసం రోడ్డుపై కూర్చోని ధర్నా చేసిన మహిళ.. కారణం తెలిస్తే నవ్వు ఆగదు!

Hyderabad Rains: వానల్లో జనాలకు సాయం.. స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్‌ పై హైదరాబాదీలు ప్రశంసలు!

Chimpanzee: వామ్మో.. చింపాంజీలు ఇంత తాగుబోతులా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!

Eating Ashes: టేస్ట్ బాగుందని.. భర్త అస్థికలను తినేసిన భార్య.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే వణికిపోతారు!

Big Stories

×