Team India : టీమిండియా ఉమెన్స్ జట్టు ఇవాళ పింక్ కలర్ జెర్సీలో దర్శనమిచ్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియయంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో రొమ్ము క్యాన్సర్ అవగాహన కల్పించేందుకు ఈ జెర్సీలో టీమిండియా ఆడుతోంది. ఈ మేరకు బీసీసీఐ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఓ వీడియో ని కూడా రిలీజ్ చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ప్రతీకా రావల్, స్నేహరాణా పింక్ జెర్సీలో కనిపించారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ అవగాహనను ప్రోత్సహించేందుకే టీమిండియా ఇవాళ మూడో వన్డేలో స్పెషల్ పింక్ కలర్ జెర్సీలను ధరిస్తుందని బీసీసీఐ పేర్కొంది. మరోవైపు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తదితర ఫ్రాంచైజీలు సైతం క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలకు మద్దతుగా ప్రత్యేక కిట్ లో కనిపించాయి.
Also Read : Suryakumar Yadav : వాడి వల్లే ఒమన్ పై బ్యాటింగ్ చేయలేకపోయాను..సీక్రెట్ బయటపెట్టిన సూర్య కుమార్
ఇదిలా ఉంటే.. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే భారత్-ఆస్ట్రేలియా జట్టు 1-1తో సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. టీమిండియా 2-1 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియా జట్టు గెలిస్తే.. కూడా ఆ జట్టు సిరీస్ కైవసం చేసుకోనుంది. ఇక సెప్టెంబర్ 20 నుంచి ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ కీలక టోర్నీకి ముందు సన్నాహకంగా ఉపయోగపడనుంది. భారత పేస్ అటాక్, టాప్ ఆర్డర్ బ్యాటింగ్ తో సిరీస్ లో ఇప్పటి వరకు బాగానే రాణించింది. కానీ మిడిల్ ఆర్డర్ కాస్త ఆందోళన కలిగిస్తోంది. బలంగా ఉన్న ఆస్ట్రైలియా బౌలింగ్ లైనప్ పై అద్భుతంగా రాణించి హర్మన్ ప్రీత్ నేతృత్వంలోని జట్టు వన్డే వరల్డ్ కప్ సాధించాలని భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు సైతం ఈ సిరీస్ లో విజయం సాధించి ప్రపంచ కప్ కి ముందు భారత్ పై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది.
Also Read : Ind vs Pak : సూపర్ 4కు ముందు పాకిస్థాన్ కు మరో షాక్ ఇచ్చిన ఐసీసీ..ఇక చుక్కలు చూడాల్సిందే
ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం చెలాయించేలా కనిపిస్తోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు వన్డే సిరీస్ కి కైవసం చేసుకోవడం ఖాయం అని తెలుస్తోంది. ఎందుకంటే..? ఆస్ట్రేలియా జట్టు 47.5 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 412 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో హేలీ 30, జార్జియా వాల్ 81, ఎల్లీస్ ఫెర్రీ 68, బెత్ మూనీ 138, ఆష్లీ గార్డనర్ 39, తహ్లియా మెక్ గ్రాత్ 14, జార్జియా వేర్‌హామ్ 16, అలనా కింగ్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టు 412 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కి ధీటుగా బ్యాటింగ్ చేస్తేనే భారత్ గెలుస్తుంది. ఆస్ట్రేలియా అద్భుతమైన బౌలింగ్ ని టీమిండియా ఉమెన్స్ ఛేదిస్తారో లేదో వేచి చూడాలి మరీ.