Kanyakumari trailer : తెలుగు సినిమా పరిశ్రమలో గర్వించదగ్గ విషయం ఏమిటంటే. సినిమా పెద్దది చిన్నది అని తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ఆ సినిమాకి ఎప్పుడు బ్రహ్మరథం పడతారు. అలానే చాలా చిన్న సినిమాలు చాలా పెద్ద స్థాయిలో సక్సెస్ సాధించాయి. ఆయన చిన్న సినిమాలను తీసిన దర్శకులు నేడు ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ స్థాయిలో నిలబడ్డారు.
రాజావారు రాణి గారు అనే ఒక సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ దర్శకుడు రవి కిరణ్ కోలా ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేస్తున్నాడు. అలానే అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాను చాలా దగ్గరుండి నడిపించాడు. కేరాఫ్ కంచరపాలెం సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. బలగం, కమిటీ కుర్రాళ్ళు, ఆయ్ వంటి చిన్న సినిమాలు మంచి ఆదరణ పొందుకున్నాయి.
కన్యాకుమారి ట్రైలర్
సృజన్ అట్టాడ దర్శకత్వంలో గీత సైని, శ్రీ చరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కన్యాకుమారి. ఈ సినిమా కథ శ్రీకాకుళం ప్రాంతంలో జరుగుతుంది. సినిమా ట్రైలర్ లో వచ్చే యాసను బట్టి దీనిని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఈ ట్రైలర్ విడుదలైంది. సిద్దు జొన్నలగడ్డ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. విలేజ్ లవ్ స్టోరీస్ కి ఎప్పుడు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమా కూడా ఒక విలేజ్ లవ్ స్టోరీ అని అర్థం అవుతుంది. ముఖ్యంగా అమ్మాయి క్యారెక్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. అలానే విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. శివ గాజుల, హరిచరణ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. రవి నిడమర్తి అందించిన మ్యూజిక్ కూడా మంచి ఫీల్ క్రియేట్ చేసింది.
మంచి రెస్పాన్స్
ప్రస్తుతం కన్యాకుమారి ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ విపరీతంగా కనెక్ట్ అవుతున్నాయి. ఒక తరుణంలో ముసలావిడని ఒక అమ్మాయి అడుగుతుంది. మీ కాలంలో డేటింగ్స్ లేవా అని. వెంటనే ఆవిడ మా కాలంలో డేటింగ్స్ కాదు అంతా బ్యాటింగ్సే అని చెబుతుంది. ఇది కామెడీగా చెప్పినా కూడా ఈ డైలాగులో చాలా డెప్త్ ఉంది. ముఖ్యంగా ఇలాంటివి ఈ సినిమాలు చాలా ఉన్నాయి అనిపిస్తుంది. అయితే ఈ లవ్ స్టోరీ మాత్రం విపరీతంగా చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ట్రైలర్ ఇంప్రెస్సివ్ గా ఉంది కాబట్టి సినిమా కూడా అదే స్థాయిలో ఉంటే దర్శకుడు ఇంకో మెట్టు పైకెక్కినట్లే.
Also Read: Peddhi: వెనక్కు తగ్గిన రామ్ చరణ్, నానికి ఇదే ప్లస్ పాయింట్