Abhishek Sharma: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 tournament ) నేపథ్యంలో టీమిండియా డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ పేరు మాత్రమే వినిపిస్తోంది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ t20 ఫార్మాట్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో… టీమిండియా తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగబోతున్న అభిషేక్ శర్మ… బౌలర్లకు నరకయాతన చూపిస్తారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో సన్రైజర్స్ తరఫున ఆడుతున్న అభిషేక్ శర్మ.. బౌలర్లకు నరకం చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 tournament ) నేపథ్యంలో కూడా అతను.. అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఐపీఎల్ లో సాధ్యం కానీ 300 పరుగులను 20 ఓవర్లలో ఫినిష్ చేసేందుకు సిద్ధమవుతున్నాడని అంటున్నారు.
ఆసియా కప్ జట్టులో అభిషేక్ శర్మకు చోటు
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ మేరకు మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో టీమిండియా జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో… టి20 స్పెషలిస్ట్ అభిషేక్ శర్మ కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో దూసుకు వెళ్తున్న అభిషేక్ శర్మకు ఓపెనర్ గా అవకాశం ఇచ్చారు. టి20 ఫార్మేట్ లో ఆసియా కప్ 2025 టోర్నమెంట్ జరగనున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే అతను జట్టులో ఉంటే కచ్చితంగా టీమిండియా భారీ స్కోర్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ అభిషేక్ శర్మతోపాటు మరొక ఓపెనర్ ఎవరు అనే దాని పైన కూడా చర్చ జరుగుతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం వికెట్ కీపర్ గా బరిలోకి దిగుతున్న సంజుకు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. ఒకవేళ అలా కాకపోతే వైస్ కెప్టెన్ గిల్ బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నాయి.
ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే ( TEAM INDIA)
టీమిండియా జట్టు : సూర్య కుమార్ యాదవ్ (C), శుబ్‌మన్ గిల్ (VC), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (wk), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, కుల్దీప్ సింగ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్ టీమిండియా జట్టు లో ఉనాన్రు.
స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్ మరియు ధ్రువ్ జురెల్ ఉన్నారు.
Also Read: India Asia Cup 2025 Squad: ఆసియా కప్ 2025 ఆడే టీమిండియా జట్టు ఇదే..శ్రేయాస్ అయ్యర్ కు నిరాశే !
?igsh=MXBpd3N4M2dxanVlbg==