Ram Charan Peddi: రామ్ చరణ్ కెరీర్ లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా త్రిబుల్ ఆర్ (RRR). ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ముఖ్యంగా రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ టాలెంట్ ఏంటో అందరికీ ఒక్కసారిగా అర్థమైంది. గ్లోబల్ స్టార్ అని ఈ సినిమాతోనే పేరొచ్చింది.
త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఇప్పటివరకు చరణ్ కి సరైన హిట్ సినిమా పడలేదు. కొరటాల శివ (Koratala Siva)దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది అని అందరూ ఊహించారు. కానీ అది జరగలేదు. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి కూడా రాజమౌళి ఫార్ములా ఈ సినిమాతో బ్రేక్ అవుతుంది అని చెప్పారు. కానీ ఆ సినిమా ఊహించిన డిజాస్టర్. శంకర్ (Director Shankar) దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ (game changer) సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
వెనక్కు తగ్గిన రామ్ చరణ్
ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు (Buchi Babu) దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షాట్ విడుదలైన సంగతి తెలిసిందే. అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా 2026 మార్చి 26న విడుదల చేస్తున్నట్లు అప్పట్లో అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడుతుంది. ఈ సినిమాను మార్చి నుంచి ఏకంగా ఆగస్టు కు వాయిదా వేస్తున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది.
నానికి ప్లస్ పాయింట్
నాని(Nani) పారడైజ్ (Paradise) సినిమా కూడా మార్చి 27న విడుదల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పెద్ది సినిమా చేస్తున్న బుచ్చిబాబు, పారడైజ్ సినిమా చేస్తున్న శ్రీకాంత్ ఓదెల వీళ్ళిద్దరూ కూడా దర్శకుడు సుకుమార్ (Sukumar) శిష్యులు. వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ లు కూడా అదే స్థాయిలో అనౌన్స్ చేశారు. ఇప్పుడు పెద్ది సినిమా ఆగస్టు నెలకు పోస్ట్ పోన్ అవుతుంది.
కాబట్టి మార్చిలో రాబోయే పారడైజ్ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అయితే చెప్పిన డేట్ కు సినిమా రిలీజ్ అయ్యేలాగా శ్రీకాంత్ చాలా పగడ్బందీగా సినిమాను ఫినిష్ చేయాలి. ఎందుకంటే అంత మంచి డేట్ మళ్లీ దొరకడం కష్టం. మరోవైపు సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయ్యే సీజన్ కాబట్టి సినిమాకు మంచి కలెక్షన్లు కూడా వస్తాయి. ఇదివరకే దసరా తో అదిరిపోయే సక్సెస్ అందించిన శ్రీకాంత్ ఇప్పుడు పారడైజ్ తో ఏ రేంజ్ సక్సెస్ ఇస్తాడు అని చాలామంది ఎదురుచూస్తున్నారు.
Also Read: Vishwambhara: విశ్వంభర వాయిదా? 2026 సమ్మర్ రిలీజ్, స్పెషల్ డేట్ ఫిక్స్