Karisma Kapoor: బాలీవుడ్ సినీనటి కరిష్మా కపూర్(Karisma Kapoor) తన మాజీ భర్త సంజయ్ కపూర్(Sanjay Kapoor) ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈయన జూన్ 12వ తేదీ లండన్ లో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. ఇలా సంజయ్ కపూర్ మరణించిన తర్వాత అసలు గొడవలు మొదలయ్యాయని చెప్పాలి. సంజయ్ కపూర్ కి సంబంధించిన ఆస్తులపై తనకు వాటా ఉంది అంటూ మాజీ భార్య కరిష్మా కపూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సంజయ్ కపూర్ మరణించిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి 30 వేల కోట్ల ఆస్తికి వారసులు ఎవరు అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోని తన మాజీ భర్త చనిపోవడంతో కరిష్మా కపూర్ కూడా తన భర్త ఆస్తిలో వాటా కావాలని లీగల్ ఫైట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఆస్తిలో వాటా కోరిన కరిష్మా?
సంజయ్ కపూర్ మరణించిన తరువాత సోనా కామ్‌స్టార్ వార్షిక సమావేశానికి ముందు, సంజయ్ తల్లి రాణి కపూర్(Rani Kapoor), సోనా గ్రూప్‌లో తనకు మెజారిటీ వాటా ఉందని, ఆస్తులకు నిజమైన వారసురాలని వెల్లడించారు అలాగే కొంతమంది కుటుంబ వారసత్వాన్ని వారి ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ పరోక్షంగా కరిష్మా కపూర్ ని ఉద్దేశించి మాట్లాడారు. అయితే కరిష్మా కపూర్ మాత్రం ఆస్తిలో వాటా కావాలని కోరడంతో ఈమె చర్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కరిష్మా కపూర్ సంజయ్ కపూర్ వివాహం జరిగిన కొంతకాలానికి విడాకులు తీసుకుని విడిపోయారు.
భర్త వద్దు.. ఆస్తి ముద్దు?
సంజయ్ కపూర్ కరిష్మా కపూర్ 2003 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఇలా వివాహం తర్వాత కొంతకాలం పాటు సంతోషంగా గడిపిన ఈ జంట 2016వ సంవత్సరంలో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకొని దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు దూరంగా ఉన్న తరువాత సంజయ్ కపూర్ మరణించడంతో ఇప్పుడు కరిష్మా కపూర్ ఆస్తిలో వాటా కోసం రావడంతో పెద్ద ఎత్తున బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఇలా ఆస్తిలో వాటా అడిగిన నేపథ్యంలో భర్త వద్దు కానీ ఆస్తిలో మాత్రం వాటాలు కావాలా అంటూ పలువురు ఈమె పై విమర్శలు కురిపిస్తున్నారు.
కొత్త డైరెక్టర్ ఎంపిక రద్దు…
ఇక సంజయ్ కపూర్ మరణం తర్వాత ఆయన ఆస్తికి అసలైన వారసులు ఎవరు అనే విషయంపై సందిగ్ధత నెలకొంది ఇప్పటివరకు వారసులు ఎవరనేది ప్రకటించలేదు కానీ కరిష్మా మాత్రం ఆస్తిలో వాటా అడిగిందంటూ వార్తలు బయటకు వచ్చాయి . ఇక సంజయ్ కపూర్ మరణించిన తర్వాత ఆయన తల్లి రాణి కపూర్ మాత్రం తన కొడుకు మరణం పై ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా తన కుమారుడు మరణించిన కొంత సమయానికి తన చేత కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని ఆమె తెలియజేశారు. సోనా గ్రూప్ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)ను రద్దు చేయాలని ఆమె అభ్యర్థించారు. ఈ సమయంలో కొత్త డైరెక్టర్ల ఎంపిక కూడా జరగకూడదని తెలియజేశారు. ఇక జూన్ 12వ తేదీ మరణించిన సంజయ్ కపూర్ అంత్యక్రియలను జూన్ 19 న దక్షిణ ఢిల్లీలోని లోధి రోడ్ శ్మశానవాటికలో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగాయి.
Also Read: Amitabh Bachchan: ఆ మూవీలో కాజోల్ కిల్లర్ అని తెలిసి అమితాబ్ షాక్.. డైరెక్టర్ కు చివాట్లు