Breaking News: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ (Sujeeth)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ఓజీ(OG). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ప్రీమియర్లకు అనుమతి లభించడమే కాకుండా అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఓజీ సినిమా హంగామా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండబోతున్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తీతమైన జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో విశ్రాంతి తప్పనిసరని వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది. గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ సోమవారం అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరయ్యారు. ఆయనకు జ్వరం తీవ్రత అధికమైన నేపథ్యంలో వైద్యులు పరీక్షలు నిర్వహించి పూర్తిగా విశ్రాంతి అవసరమని సూచించినట్టు తెలుస్తుంది.
అంచనాలు పెంచిన ట్రైలర్..
ఇలా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఈయన మాత్రం రాజకీయ వ్యవహారాలలో పాల్గొన్నారు. తన మంత్రిత్వ శాఖలకు సంబంధించి అధికారులతో టెలికాన్ఫరెన్స్ లు నిర్వహించారు. ఇలా పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే .. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కూడా సినిమాపై ఎంతో మంచి అంచనాలను పెంచేసింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా భారీ స్థాయిలో ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు.
ఓపెనింగ్స్ తో 100 కోట్లు రాబట్టేనా?
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా పక్క బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, మొదటి రోజు 100 కోట్ల క్లబ్ చేరుతుంది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల కాబోతున్న రెండో సినిమా కావటం విశేషం. ఇదివరకు హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అభిమానులు ఈ సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక ఆరుళ్ మోహన్(Priyanka Arul Mohan) నటించారు. శ్రేయ రెడ్డి, ఇమ్రాన్ హస్మి, ప్రకాష్ రాజ్ వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు.
Also Read: National Film Awards 2025: నేషనల్ అవార్డ్స్ వచ్చేశాయి… బాలయ్య మూవీతో పాటు వీళ్లకు పురస్కారం