చిన్న పిల్లలు స్కూల్ కు వెళ్తుంటే ఎంతో ముద్దుగా అనిపిస్తుంది. స్కూల్ కు వెళ్లనని ఏడ్చినా క్యూట్ గానే ఉంటుంది. స్కూల్ కు వెళ్లను అని చెప్పేందుకు వాళ్లు చెప్పే కారణాలు కూడా మరింత స్వీట్ గా అనిపిస్తాయి. అయితే, తాజాగా ఓ చిన్నారి స్కూల్ కు వెళ్లేందుకు రెడీ అయి.. బస్ కోసం వెయిట్ చేస్తున్నా, డ్రైవర్ ఆపకుండా వెళ్లడంతో గుక్కపట్టి ఏచ్చింది. వెంటనే విషయం తెలుసుకుని బస్సును వెనుక రివర్స్ లో తీసుకొచ్చి ఆమె బస్సు ఎక్కించుకుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఎప్పటి లాగే ఓ చిన్నారి స్కూల్ కు వెళ్లేందుకు రెడీ అవుతుంది. స్కూల్ బ్యాగ్ వేసుకుని, లంచ్ బాక్స్ పట్టుకుని, రోజూ తన స్కూల్ బస్ ఆపే చోటుకు వెళ్లి నిల్చుంటుంది. బస్సు దూరం నుంచి కనిపించగానే ఆపమని చెయ్యి పైకి ఎత్తుతుంది. కానీ, డ్రైవర్ ఆమెను గమనించకుండా ముందుకు వెళ్లిపోతాడు. తనను ఎక్కించుకోకుండా బస్సు వెళ్లిపోయిందని చిన్నారు ఎంతో ఆవేదన చెందింది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమె తర్వాత ఓదార్చేందుకు ప్రయత్నిస్తుంది. “ఏం ఫర్వాలేదు. బహుశా అతడు నిన్ను చూడకపోవచ్చు. బాధపడకు. తప్పకుండా తిరిగి వెనక్కి వస్తుంది” అని సర్దిచెప్తుంది.
కాస్త ముందుకు వెళ్లగానే డ్రైవర్ పొరపాటును తెలుసుకున్నాడు. వెంటనే బస్సును వెనక్కి రివర్స్ లో తీసుకొచ్చాడు. వెళ్లిపోయింది అనుకున్న బస్సు తిరిగి రావడంతో ఆ చిన్నారి ఎంతో సంతోషించింది. ఇక బస్సు డ్రైవర్ కూడా జరిగిన పొరపాటుకు సారీ చెప్పాడు. మళ్లీ ఎప్పుడూ అలా జరగనివ్వనని హామీ ఇస్తాడు. అతడు చెప్పిన మాటతో చిన్నారితో పాటు ఆమె తల్లి కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. పాప సంతోషంతో వెళ్లి బస్సు ఎక్కుతుంది.
Read Also: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?
ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది. ఈ క్యూట్ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ చిన్నారి ఆవేదన పట్ల బాధపడుతున్నారు. చిన్న హృదయం ఎంత బాధపడి ఉంటుందో అని కామెంట్స్ పెడుతున్నారు. ఆమె చిన్నారి భావోద్వేగాన్ని అర్థం చేసుకుని బస్సు వెనక్కి తీసుకొచ్చిర డ్రైవర్ ను అభినందిస్తున్నారు. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగదని చెప్పడం పట్ల హ్యాపీగా ఫీలవుతున్నారు.
Read Also: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!