Tanushree Dutta: బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరభద్ర అనే సినిమాలో బాలకృష్ణ సరసన నటించిన తనుశ్రీకి ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక సినిమాలతో కాదు కానీ, అమ్మడు వివాదాలతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. అసలు ఇండస్ట్రీలో మీటూ ఉద్యమానికి ఆజ్యం పోసింది తనుశ్రీ దత్తానే. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ను ఎంతోమంది హీరోయిన్స్ ను ఎదుర్కొన్నారు. కానీ, ఎవరూ బయటపడలేదు. కొందరు అవకాశాలు పోతాయేమో అని భయపడితే.. ఇంకొందరు ఎక్కడ తమను ఏమైనా చేస్తారేమో అని భయపడ్డారు. కానీ, తనుశ్రీ దత్తా మాత్రం ఎవరికీ భయపడలేదు.
ముంబైలోని అంధేరి శివారులోని ఓషివారా పోలీస్ స్టేషన్‌లో నటుడు నానా పటేకర్, గణేష్ ఆచార్య, రాకేష్ సారంగ్ మరియు అబ్దుల్ సమీ అబ్దుల్ గని సిద్ధిఖీలపై నటి తనుశ్రీ దత్తా కేసు పెట్టిన విషయం అందరికీ తెల్సిందే. సెట్ లో తనను లైంగికంగా వేధించారని, తాకారని చోట తాకారని ఫిర్యాదులో తెలిపింది. అలా ఆమె బయటపడిన దగ్గరనుంచి ప్రతి ఒక్కరు కూడా దైర్యంగా బయటకు చెప్పడం మొదలుపెట్టారు. ఈ కేసులో నానా పటేకర్.. కోర్టుల చుట్టూ తిరుగుతూ చివరకు ఏదో విధంగా బయటపడ్డాడు.
ఇక మీటూ కేసు తరువాత తనుశ్రీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఆమెపై ఎన్నోసార్లు హత్యాప్రయత్నాలు కూడా చేశారని, చాలామంది తనను వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా తాను ఎంతో దైర్యంగా నిలబడినట్లు చెప్పే తనుశ్రీ ఈసారి మాత్రం దైర్యం కోల్పోయి కన్పించింది. తన ఇంట్లో వారే తనను వేధిస్తున్నారని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను అభిమానులతో షేర్ చేసుకుంది.
‘కొన్నేళ్లుగా నా ఇంట్లో వాళ్లే నన్ను వేధిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. స్టేషన్ కు వచ్చి కంప్లైట్ ఇవ్వమన్నారు. మరో రెండు రోజుల్లో నేను స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తాను. గత నాలుగైదేళ్లుగా ఈ బాధను నేను భరించలేకపోతున్నాను. నా ఇల్లు.. నాదిలా అనిపించడం లేదు. అంతా చిందరవందరగా మారిపోయింది. పనివాళ్లను పెట్టుకుంటే.. వారు కూడా నన్ను మోసం చేస్తున్నారు. ఏది దొరికితే అది దొంగలిస్తున్నారు. నా ఇంట్లోనే నాకు సేఫ్టీ లేకుండా పోయింది. దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి’ అంటూ చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా ‘గత రెండు సంవత్సరాలుగా మా ఇంటివద్ద పెద్ద శబ్దాలు వినపడుతున్నాయి. ఈ సౌండ్స్ గురించి భవన నిర్వహణ అధికారులకు చెప్పి చెప్పి విసిగిపోయాను. ఆ శబ్దాలు నన్ను చాలా వేధిస్తున్నాయి. రోజంతా ఇలానే జరుగుతుంది. దీనివలన నేను అనారోగ్యానికి గురయ్యాను. విశ్రాంతి తీసుకోలేకపోతున్నాను. ప్రతిరోజు ఎవరో ఒకరు ఇంటి తలుపు కొడుతూ విసిగిస్తున్నారు. డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పినా కూడా బెల్ మోగించడం ఆపడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.