BigTV English

Stamp Duty Reduced: ఏపీలో వారందరికీ శుభవార్త.. ఉత్తర్వులు జారీ, రియల్ ఎస్టేట్‌ సెక్టార్‌కి ఊపు

Stamp Duty Reduced: ఏపీలో వారందరికీ శుభవార్త.. ఉత్తర్వులు జారీ, రియల్ ఎస్టేట్‌ సెక్టార్‌కి ఊపు

Stamp Duty Reduced: రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది కూటమి సర్కార్. ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం స్టాంప్ డ్యూటీని ఒక శాతానికి పరిమితం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఎవరికి లాభం అన్నదే అసలు పాయింట్.


కేవలం సంక్షేమమే కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టింది చంద్రబాబు సర్కార్. కేవలం పరిశ్రమలు వచ్చేందుకు మాత్రమే కాదు.. వివిధ రంగాల సెక్టార్లు పుంజుకునే ఇటీవల కాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేందుకు స్టాంప్ డ్యూటీని తగ్గించింది.

ముఖ్యంగా డెవలప్‌మెంట్ అగ్రిమెంట్, సేల్ కం జీపీఏ కింద చెల్లించే స్టాంపు డ్యూటీని 4 శాతం నుంచి ఒక్కశాతనికి తగ్గించింది. ఈ మేరకు రెవిన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్థిరాస్తి రంగానికి కొంతవరకు ఆర్థిక భారం తగ్గుతుంది.


భూమి యజమానులు-బిల్డర్ల మధ్య జరిగే ఒప్పందాలు అన్నమా. ఇంకా చెప్పాలంటే ఫ్లాట్లు-పాట్ల కేటాయింపుల నిష్పత్తులను అనుసరించి 1 శాతం నుంచి 4 శాతం వరకు స్టాంపు డ్యూటీ వసూలు చేస్తున్నారు. అయితే సేల్‌ కం జీపీఏ విధానంలో భూమి యజమాని నుంచి పొందిన ఆస్తి విలువను బట్టి 5 శాతం వరకు స్టాంపు డ్యూటీని చెల్లించాల్సి వచ్చేది.

ALSO READ: నరికేస్తాం అంటే చేతులు కట్టుకోం, వైసీపీపై పవన్ కామెంట్స్

ఒక విధంగా బిల్డర్లకు పెనుభారంగా మారింది. దాని ఫలితంగా గడిచిన నాలుగైదు ఏళ్లులో బిల్డర్లు ఏపీ వైపు చూడలేదు.  పాత విధానం వల్ల ఆర్థిక భారం పెరిగిందని ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశాయి నరెడ్కో, క్రెడాయ్ సంస్థలు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ తగ్గించాలని కోరాయి. దీంతో ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయం తీసుకుంది.

నాలుగు శాతం స్టాంప్ డ్యూటీని ఒక శాతానికి పరిమితం చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన స్టాంపు డ్యూటీ తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టాంపు డ్యూటీ తగ్గించడంతో నిర్మాణ దారులకు, ప్లాట్లు కొనుగోలు చేసేవారికి వెసులుబాటు కలిగింది. స్టాంప్ డ్యూటీ తగ్గించడంతో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని భావిస్తోంది ప్రభుత్వం.

స్టాంప్ రెవెన్యూ శాఖ ద్వారా జరిగే భూ వినియోగ మార్పిడి అనుమతుల జారీ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు భవనాలు నిర్మించుకునే వారి కోసం కొత్తగా స్వీయ ధ్రువీకరణ పథకాన్ని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ విధానంతో ఇళ్లు, భవనాలకు అనుమతులు వేగంగా లభించనున్నాయి.

ప్రతీ ఏటా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో దాదాపు 40 వేల ఇళ్లు, భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటున్నారు. అందులో 100 నుంచి 200 చదరపు గజాల్లోపు స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా పేదలు, మధ్యతరగతి వారు 80 శాతం వరకు వాటిలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు పట్టణ, నగరాల్లో వేగంగా నిర్మాణ రంగం పుంజుకో నుంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×