Ravi Kishan:ప్రముఖ నటుడు రవికిషన్ (Ravi Kishan).. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచిన ఈయన.. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలలో నటించారు. భోజ్ పురి ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా ఒక వెలుగు వెలిగిన ఈయన.. తెలుగులో రేసుగుర్రం తర్వాత కిక్ 2, సుప్రీమ్, ఎమ్మెల్యే, లై, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయకుడు, 90 ఎం.ఎల్, హీరో ఇలా పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి మెప్పించారు.
సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా..
రవి కిషన్ సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈయన.. 2017లో బీజేపీలో చేరి 2019 ఎన్నికలలో గోరఖ్ పూర్ ఎంపీగా విజయం సాధించి, పార్లమెంటులోకి అడుగుపెట్టారు. 2024 జనరల్ ఎలక్షన్స్ లో కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు..
రవికిషన్ వ్యక్తిగత జీవితం..
ఇక ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే 1993లో ప్రీతి శుక్లా (Preity Shukla) తో ఏడడుగులు వేయగా.. మొత్తం నలుగురు సంతానం. ఒక కుమారుడు, ముగ్గురు కూతుర్లు. వీరిలో ఒకరు భారత ఆర్మీలో చేరి సేవలు అందిస్తున్నారు. ఇంకో కూతురు రివా కిషన్ (Riva Kishan).
తండ్రి అడుగుజాడల్లో.. స్టార్ హీరోయిన్గా గుర్తింపు..
ఈమె కూడా ఒక స్టార్ హీరోయిన్ అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే నటనపై మక్కువ పెంచుకున్న ఈమె.. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. 2017లో బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా కుమార్తె హీబా తో కలిసి ‘పరిందో కి మెహ్ఫిల్’ అనే నాటకంలో పనిచేసింది. 2016లో ముంబైలోని టెరెన్స్ లూయిస్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి డాన్స్ లో శిక్షణ తీసుకున్న ఈమె.. నటనలో శిక్షణ తీసుకోవడానికి యూఎస్ఏ కి కూడా వెళ్ళింది. ఇక తర్వాత ‘సబ్ కుశల్ మంగల్’ అనే సినిమాతో 2020లో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా అటు రివాకి కూడా మంచి మార్కులే పడ్డాయి.
బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన రివా కిషన్..
ఇకపోతే ప్రస్తుతం తన ఆలోచనలను వ్యాపారం వైపు మళ్ళించిన ఈమె.. తాజాగా వ్యాపార రంగంలో అడుగుపెట్టింది. తొలి ఫ్యాషన్ లేబుల్ క్లాతింగ్ బ్రాండ్ ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ ద్వారా భారీగా ఆర్జిస్తూనే అటు సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. మొత్తానికైతే స్టార్ సెలబ్రిటీ కూతురిగా తనకంటూ ఒక హోదాను సొంతంగా బిల్డ్ చేసుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు.
ALSO READ:Manchu Lakshmi: గొప్ప పనికి శ్రీకారం చుట్టిన మంచు వారసురాలు.. నిజంగా గ్రేట్ మేడం!