E-Paper
Advertisement

స్టార్ హీరోయిన్‌కే టోకరా.. క్రెడిట్ కార్డు నుంచి రూ.2.43 లక్షలు స్వాహా..!

స్టార్ హీరోయిన్‌కే టోకరా.. క్రెడిట్ కార్డు నుంచి  రూ.2.43 లక్షలు స్వాహా..!
Advertisement

Cyber Fraud:సైబర్ మోసాలు మాములు జనాలనే కాదు..సినీ సెలెబ్రిటీలనీ వదలట్లేదు,అవును ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు దీనికి బలికాగా తాజాగా ఇప్పుడు అలాంటి  అనుభవమే బాలీవుడ్ హీరోయిన్ కీర్తి కుల్హారికి ఎదురైంది.తాను ఏమీ కొనకపోయినా.. తన క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా రూ.2.43 లక్షలకు పైగా డబ్బు కట్ అయిందంటూ వాపోతుంది.

విషయంలోకి వెళ్తే జూలై 24 రాత్రి అంధేరి వెస్ట్‌లోని ఓ మల్టీప్లెక్స్ కి షాపింగ్ వెళ్ళింది కీర్తి కుల్హారి.అయితే అక్కడ ఉన్న సమయంలో ఒక బ్యాంక్ నుండి ఒక ట్రాన్సాక్షన్ అలర్ట్ వచ్చిందట.ఎంటని చూస్తే  విదేశీ ఎయిర్‌లైన్ ఏరోమెక్సికో పేరుతో 2,525 డాలర్ల ట్రాన్సాక్షన్ జరిగిందని చూపించిందట,అయితే తాను ఎలాంటి షాపింగ్ చేయలేదని,అలాంటప్పుడు ఇలా డబ్బులు ఎలా కట్ అవుతాయా అంటూ లబో దిబో మంటుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

Advertisement

మొత్తంగా రూ.2.43 లక్షలకు పైగా

అయితే కేవలం ఒక్కసారి మాత్రమే కాదండోయ్ …కొన్ని నిమిషాలలోనే ఏకంగా నాలుగు సార్లు ఆమె కార్డు నుంచి డబ్బు డ్రా అయినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించి చెప్పారట.అలా మొత్తంగా రూ.2.43 లక్షలకు పైగా మనీ తన అకౌంట్ నుండి కట్ అయిపోయిందని అధికారులు చెప్పడంతో షాక్ అవడం కీర్తి కుల్హారి వంతయింది.ఇక వెంటనే   కార్డును బ్లాక్ చేయడంతో మిగిలిన ట్రాన్సాక్షన్ ఆగిపోయాయి.లేకపోతె మరిన్ని డబ్బులు పోయేవే .

Advertisement

ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది కీర్తి కుల్హారి.ఇక కేసుని ఫైల్ చేసిన పోలీసులు అసలు ఈ డబ్బుని ఎవరు అకౌంట్ లోకి ఎలా వెళ్ళింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.

also read :‘సత్య’ తర్వాత నాతో షారుఖ్ అన్నది ఇదే…ఇన్నాళ్లకు నోరు విప్పిన జేడీ..!

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తన కార్డు పిన్, ఓటీపీ, సీవీవీ, పాస్‌వర్డ్ లాంటివి తాను ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదని కీర్తి స్పష్టం చేసింది.దీంతో ఆమె మొబైల్‌లోకి మాల్వేర్ లేదా స్పైవేర్ వెళ్లి కార్డు వివరాలు దొంగిలించి ఉండొచ్చని భావిస్తున్నారట పోలీసులు.

ట్రాన్సాక్షన్ అలర్ట్స్ తప్పనిసరిగా 

ఇప్పుడు రోజూ ఫేక్ లింకులు, నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు, డిస్కౌంట్ ఆఫర్లు, కొరియర్ మెసేజ్‌లు, కేవైసీ అప్‌డేట్ పేరుతో వచ్చే లింకులు ఓపెన్ చేస్తే చాలు.. ఫోన్‌లోకి వైరస్ చేరి బ్యాంకింగ్ వివరాలు కొట్టేసే ముఠాలు యాక్టివ్‌గా ఉన్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తెలియని లింకులపై క్లిక్ చేయొద్దని, పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ చేయొద్దని, కార్డు ట్రాన్సాక్షన్ అలర్ట్స్ తప్పనిసరిగా ఆన్‌లో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

కెరీర్ విషయానికి వస్తే

ఇక కీర్తి కుల్హారి కెరీర్ విషయానికి వస్తే 2016లో వచ్చిన ‘పింక్’ సినిమాతో సత్తా చాటిన ఈ భామ 2019లో రిలీజైన ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘మిషన్ మంగళ్’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది.ఇక  ఓటీటీలో వచ్చిన ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!’ వెబ్‌సిరీస్‌తో యూత్ కి  మరింత దగ్గరయింది. ముఖ్యంగా 2023లో వచ్చిన ‘స్కూప్’ వెబ్‌సిరీస్‌లో ఆమె నటనకు ఆకాశానికి ఎత్తేశారంతా.

చూడాలి మరి కీర్తి కుల్హారి నుండి డబ్బులు ఎలా పోయాయి అన్నదానికి పోలీసులకి ఎలాంటి సమాధానం వస్తుందో !

also read :మరో ఖరీదైన ఇల్లు కొన్న విరుష్క…ధర వింటే కళ్లు తిరగాల్సిందే..!

Related News

గోల్డ్ స్కామ్‌లో ఇరుక్కున్న ‘లఫూట్ గ్యాంగ్’ నిర్మాత, ఏం చేశాడంటే?

‘సత్య’ తర్వాత నాతో షారుఖ్ అన్నది ఇదే…ఇన్నాళ్లకు నోరు విప్పిన జేడీ..!

మరో ఖరీదైన ఇల్లు కొన్న విరుష్క…ధర వింటే కళ్లు తిరగాల్సిందే..!

వరుణ్ తేజ్ మంచి మనసు.. ట్యూమర్ చికిత్సకి అయ్యే పూర్తి ఖర్చు తనదే అంటూ!

Srinivas Mangapuram Twitter Review : ‘శ్రీనివాస మంగాపురం ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

నాతో మీకు ప్రాబ్లమ్ ఏంటి..? కిరణ్ అబ్బవరం ఎదగకూడదా..?

Ramayana Trailer Review : విజువల్ వండర్ గా ‘రామాయణ’ ట్రైలర్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజువల్స్..

Big Stories

Advertisement
×