Honor X6e 4G: బడ్జెట్ ధరలో ఎక్కువ రోజులు పనిచేసే స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి హానర్ ఒక మంచి శుభవార్త చెప్పింది. మలేషియా మార్కెట్‌లో Honor X6e 4G పేరుతో కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, తక్కువ ధరతో వస్తున్న ఈ ఫోన్.. ముఖ్యంగా ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునే యూజర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది.
ఈ Honor X6e 4Gలో అత్యంత ముఖ్యమైన విశేషం ఇందులోని 7500mAh భారీ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా వీడియోలు చూసినా, సోషల్ మీడియా వాడినా లేదా గేమ్స్ ఆడినా ఛార్జింగ్ అయిపోతుందనే భయం ఉండదు. ఇక దీనిని వేగంగా ఛార్జ్ చేయడం కోసం కంపెనీ 45W సూపర్‌ఛార్జ్ టెక్నాలజీని కూడా అందించింది.
Also Read: కలర్‌ఫుల్ నుంచి అద్భుతమైన ల్యాప్‌టాప్.. రైజెన్ 7 ప్రాసెసర్, 2.5K డిస్‌ప్లేతో అదరగొట్టే ఫీచర్లు!
హానర్ X6e 4G ఫోన్ 6.61 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. స్క్రీన్ చూసేటప్పుడు కళ్లకు అలసట కలగకుండా ప్రత్యేక ఐ-కామ్ఫర్ట్ ఫీచర్లను ఇచ్చారు. మీడియాటెక్ హెలియో G81 ఆల్ట్రా ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నాయి. మల్టీటాస్కింగ్ సులువుగా అయ్యేందుకు మరో 4GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది.
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ధూళి, నీటి చినుకుల నుండి రక్షణ కోసం IP64 రేటింగ్ అందించడం విశేషం. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ పట్టుకోవడానికి వీలుగా సన్నగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది.
మలేషియాలో దీని ధర RM 699గా నిర్ణయించారు. మన భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.16,000 వరకు ఉంటుంది. ఈ Honor X6e 4G ఫోన్ సన్‌రైజ్ గోల్డ్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ ఇతర దేశాల్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.
Also Read: ఉన్నట్టుండి Pixel 11 Series ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? లీకైన వివరాలు ఇవే!