E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో.. మైండ్ బ్లోయింగ్ ఆడియో! ఈ బ్లూటూత్ స్పీకర్ పై ఓ లుక్కేయండి

బడ్జెట్ ధరలో.. మైండ్ బ్లోయింగ్ ఆడియో! ఈ బ్లూటూత్ స్పీకర్ పై ఓ లుక్కేయండి
Advertisement

Dubstep Pop 1400 bluetooth speaker: ఇంట్లో చిన్న పార్టీ అయినా, ఫ్రెండ్స్‌తో ఔటింగ్ లేదా పిక్నిక్ అయినా.. గట్టిగా మ్యూజిక్ వినిపించే పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ ఉంటే.. ఆ వైబే వేరు! అయితే తక్కువ బడ్జెట్‌లో అదిరి పోయే బాస్, పవర్ ఫుల్ సౌండ్ అండ్ లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇచ్చే స్పీకర్ ఎంచుకోవడమే అసలైన టాస్క్. అలాంటి మ్యూజిక్ లవర్స్ కోసం మార్కెట్‌లోకి వచ్చిన పాపులర్ మోడల్ Dubstep Pop 1400 Portable Bluetooth Speaker. 14W లౌడ్ ఆడియో, డీప్ XBASS అండ్ 16 గంటల నాన్-స్టాప్ ప్లేటైమ్‌తో వచ్చే ఈ పోర్టబుల్ స్పీకర్ వివరాలు ఇప్పుడు చూద్దాం!

ట్రెండీ అండ్ కాంపాక్ట్ పోర్టబుల్ డిజైన్:

Dubstep Pop 1400 స్పీకర్‌ను చూడగానే ముందుగా ఆకట్టుకునేది దీని స్టైలిష్ అండ్ యూత్ ఫుల్ డిజైన్. చేతిలో.. ఈజీగా పట్టుకెళ్లేంత కాంపాక్ట్‌గా, లైట్ వేట్‌గా ఉంటుంది. ట్రావెలింగ్ చేసేటప్పుడు బ్యాగ్‌లో పెట్టుకోవడానికి లేదా పూల్ సైడ్, రోడ్‌ట్రిప్స్‌లో వెంట తీసుకెళ్లడానికి ఇది చాలా హ్యాండీగా అమరి పోతుంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా రఫ్‌గా వాడినా తట్టుకునేలా పటిష్టంగా తీర్చిదిద్దారు.

14W లౌడ్ సౌండ్:

Advertisement

పరిమాణంలో చిన్నదే అయినా సౌండ్ ఆవుట్‌పుట్ విషయంలో.. ఇది ఒక చిన్న సైజు బాంబ్ అని చెప్పవచ్చు! ఇందులో.. ఇచ్చే 14W పవర్ ఫుల్ అవుట్‌పుట్ ఓపెన్ స్పేస్‌లలో కూడా అత్యంత స్పష్టమైన, బిగ్గరైన ఆడియోను అందిస్తుంది. ప్రత్యేకంగా దీంట్లో ఉన్న XBASS టెక్నాలజీ వల్ల డీప్ అండ్ పంచీ బాస్ లభిస్తుంది. డ్యాన్స్ పాటలు, బీట్స్ ఉన్న ఆడియో వింటున్నప్పుడు కిక్ ఇచ్చే బాస్ ఎక్స్‌పీరియన్స్ మీ సొంతమవుతుంది.

16 గంటల ప్లేటైమ్:

స్పీకర్ విషయంలో అందరినీ వేధించే ప్రధాన సమస్య బ్యాటరీ ఛార్జింగ్! అయితే.. స్పీకర్ ఈ విషయంలో అస్సలు నిరాశపరచదు. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఇది ఏకంగా 16 గంటల ప్లేటైమ్ (నాన్-స్టాప్ ప్లేబ్యాక్) ఇస్తుంది. రోజంతా బయటకు వెళ్లినా ఛార్జర్ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా రోజంతా నాన్-స్టాప్‌గా పాటలు వినవచ్చు.

మల్టీ-కనెక్టివిటీ, ఫాస్ట్ బ్లూటూత్:

Advertisement

ఈ స్మార్ట్ స్పీకర్‌లో లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చారు. దీని వల్ల స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ లేదా ల్యాప్‌టాప్‌కి క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. ఆడియో డ్రాప్ అవ్వడం లేదా ల్యాగ్ అవ్వడం లాంటి సమస్యలు ఉండవు. బ్లూటూత్‌తో పాటు ఎక్స్‌టర్నల్ ఆడియో కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉండటం వల్ల వైర్‌లెస్ గానే కాకుండా.. ఇతర మార్గాల్లో కూడా పాటలు ఆస్వాదించవచ్చు.

Also Read: ఎల్జీ ఫ్రంట్ లోడ్‌లో ఇన్ని ఫీచర్లా? చేతితో ఉతికినట్లే మురికి మాయం చేసే కిర్రాక్ మెషీన్!

ఇన్-బిల్ట్ మైక్ , ఈజీ కంట్రోల్స్:

పాటలు వింటున్నప్పుడు ఫోన్ కాల్స్ వస్తే స్పీకర్ డిస్‌కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లోని ఇన్-బిల్ట్ మైక్రోఫోన్ ద్వారా డైరెక్ట్‌గా స్పష్టంగా మాట్లాడవచ్చు. స్పీకర్ బాడీపై ఇచ్చే ఫిజికల్ బటన్స్ ద్వారా వాల్యూమ్ పెంచడం/తగ్గించడం, ట్రాక్స్ మార్చడం అండ్ కాల్స్ అటెండ్ చేయడం చాలా ఈజీగా చేయవచ్చు.

ధర :

ఇన్ని ప్రాక్టికల్ ఫీచర్లు ఉన్న బ్లూటూత్ స్పీకర్ మార్కెట్‌లో అత్యంత ఆకర్షణీయమైన బడ్జెట్ ధర రూ. 1,499 (ఈ-కామర్స్ ఆఫర్లలో రూ.1,299 వరకు) లభిస్తోంది. తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ పోర్టబుల్ స్పీకర్ కోరుకునే వారికి ఇది బెస్ట్ డీల్.

Related News

రూ.16 వేలకే రఫ్ అండ్ టఫ్ ఫోన్.. సన్‌రైజ్ గోల్డ్ కలర్‌లో ఆకట్టుకుంటున్న Honor X6e 4G!

ప్రీమియం లుక్స్, మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు..ఈ స్మార్ట్‌వాచ్ ధర ఎంతంటే?

బ్లూటూత్ ఇయర్‌బర్డ్స్‌ కింగ్ వచ్చేసింది..డోంట్ మిస్

సినిమా హాల్ ఎక్స్‌పీరియన్స్..ఇంట్లోనే! ఈ సౌండ్‌బార్ వైబ్స్ నెక్స్ట్ లెవెల్!

కలర్‌ఫుల్ నుంచి అద్భుతమైన ల్యాప్‌టాప్.. రైజెన్ 7 ప్రాసెసర్‌, 2.5K డిస్‌ప్లేతో అదరగొట్టే ఫీచర్లు!

ఎల్జీ ఫ్రంట్ లోడ్‌లో ఇన్ని ఫీచర్లా? చేతితో ఉతికినట్లే మురికి మాయం చేసే కిర్రాక్ మెషీన్!

గేమర్స్, మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఆఫర్‌లో 65 ఇంచుల స్మార్ట్ టీవీ

Big Stories

Advertisement
×