Keerthy Suresh: చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత తన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచింది కీర్తి సురేష్ (Keerthy Suresh). ‘నేను శైలజా’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత ‘మహానటి’ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది. ఇక ‘దసరా’ లాంటి సినిమాలలో డీ గ్లామరస్ పాత్ర పోషించి ఆకట్టుకున్న కీర్తి సురేష్.. ఇటీవల వచ్చిన ‘ఉప్పుకప్పురంబు’ సినిమాలో అమాయకపు ఊరి పెద్ద పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇలా పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేయగలిగిన సత్తా ఉన్న హీరోయిన్గా రికార్డు సృష్టించింది కీర్తి సురేష్.
పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న కీర్తి సురేష్..
అలాంటి ఈమెకు సంబంధించి తాజాగా ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కీర్తి సురేష్ రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతోంది అనే ఒక వార్త అభిమానులలో అనుమానాలకు తెరలేపింది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా కీర్తి సురేష్ మదురైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళగా.. అక్కడ ఆమెను చూడగానే కొంతమంది అభిమానులు టీవీకే.. టీవీకే అంటూ నటుడు విజయ్ పార్టీ పేరు చెబుతూ కేకలు పెట్టారు. ఇక కీర్తి సురేష్ నటుడు విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయింది. దీనిపై కీర్తి సురేష్ స్పందించలేదు. అందుకే ఈమె విజయ్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉంది అనే ప్రచారం ఊపందుకుంది. మరి దీనిపై కీర్తి సురేష్ స్పందిస్తుందేమో చూడాలి.
కీర్తి సురేష్ సినిమా జీవితం..
కీర్తి సురేష్ విషయానికి వస్తే.. నటి మేనక, నిర్మాత జి సురేష్ కుమార్ ల కూతురు.మొదట్లో బాల నటిగా తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి.. వెండి తెరకు తిరిగి వచ్చిన ఈమె.. తర్వాత హీరోయిన్ గా నటించడం మొదలు పెట్టింది. అలా 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి ద్వారా హీరోయిన్గా సినీ రంగ ప్రవేశం చేసింది కీర్తి సురేష్. ఆ తర్వాత తెలుగు, తమిళ్ ఇప్పుడు హిందీలో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
కీర్తి సురేష్ వైవాహిక జీవితం..
ఇకపోతే కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడైన ఆంటోనీ తట్టిల్ ను 2024 డిసెంబర్ 12వ తేదీన గోవాలోని ఒక ప్రైవేటు రిసార్ట్ లో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత మళ్లీ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే సమంత సహాయంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ ‘బేబీ జాన్’ సినిమా చేసి సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం సౌత్ సినిమాలలో నటిస్తోంది.
ALSO READ:Fish Venkat: ఫిష్ వెంకట్ కి సీరియస్.. కళ్ళు తెరవలేని పరిస్థితుల్లో.. మరో హాస్పిటల్ కు తరలింపు!