Aadhaar Updates: కొత్త ఆధార్ కార్డు పొందాలనుకుంటున్నారా? పాత ఆధార్‌లో పేరు లేకుంటే చిరునామా మార్చాలనుకుంటున్నారా? 2025-26 సంవత్సరానికి ఆధార్ అప్డేట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల జాబితాను విడుదల చేసింది యూఐడీఏఐ. ఆధార్ కార్డు పొరపాటున ఒకరి పేరు మీద రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మొదట జారీ చేసినది మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
ఈ విషయాన్ని యూఐడీఏఐ క్లారిటీ ఇచ్చింది. మిగతా అన్ని ఆధార్ కార్డులు రద్దవుతాయి. పాత ఆధార్‌లో పేరు, చిరునామా, ఫోటో వంటివి ఏమైనా మార్చాలనుకుంటున్నారా? కొత్త నిబంధనలను జాగ్రత్తగా తెలుసుకోవాలి.
ఐడెంటిటీ ప్రూఫ్- మీ పాస్‌పోర్ట్ లేదా పాన్ కార్డు ఉండాలి. అయితే ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ప్రభుత్వాలు జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు, నరేగా జాబ్ కార్డు, పెన్షనర్ గుర్తింపు కార్డు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కార్డు, ట్రాన్స్జెండర్ ఐడి కార్డును డాక్యుమెంట్‌గా ఇవ్వాలి.
అడ్రస్ ప్రూఫ్-విద్యుత్ / నీరు / గ్యాస్ / ల్యాండ్ లైన్ బిల్లు ఉండాలి. ఇది మూడు నెలల కంటే తక్కువ కాకుండా ఉండాలి. బ్యాంక్ పాస్‌బుక్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, అద్దె ఒప్పంద పత్రం, పెన్షన్ డాక్యుమెంట్, రాష్ట్ర / కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని రుజువుగా ఉపయోగించవచ్చు.
ALSO READ: భార్యకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన లాయర్, ఓపెన్ చేయగానే పోలీసులు వచ్చి
బర్త్ సర్టిఫికేట్- స్కూల్ మార్క్ షీట్, పాస్‌పోర్ట్, పుట్టిన తేదీ రాసిన పెన్షన్ డాక్యుమెంట్, పుట్టిన తేదీతో రాష్ట్ర లేదా కేంద్రప్రభుత్వ సర్టిఫికేట్ వినియోగించవచ్చు.
అవసరమైతే సంబంధానికి రుజువు ఉండాలి. ఈ కొత్త నిబంధనలు ఎవరికి? అన్నది ప్రధాన పాయింట్. భారతీయ పౌరులు, ప్రవాస భారతీయులు, ఐదేళ్లు కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు, దీర్ఘకాలిక వీసాలపై దేశంలో ఉంటున్న విదేశీయులకు వర్తిస్తుంది. అలాగే ప్రాంతీయ కార్యాలయంలో పై డాక్యుమెంట్ చూపించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓసీఐ కార్డుదారులు తమ పాస్‌పోర్ట్, వీసా, పౌరసత్వ ధృవీకరణ పత్రం లేదా ఎఫ్ఆర్ఆర్ఓ నివాస అనుమతిని చూపించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది 2026 జూన్ 14 వరకు ఆన్‌లైన్ ద్వారా ఆధార్ అప్‌డేట్స్ ఉచితంగా చేసుకోవచ్చు.
తొలుత మై ఆధార్ పోర్టల్‌లో లాగిన్ కావాలి. అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి. ఫోన్ నెంబర్ ఇస్తే దానికి ఓటీపీ వస్తుంది. బయో మెట్రిక్ లేకుంటే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. అప్‌డేట్ తర్వాత ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.