Film industry..తాజాగా నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం హీరో, హీరోయిన్లకు పరీక్షా సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా సెట్లోకి అడుగు పెట్టాలి అంటే కచ్చితంగా నటీనటులు ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ చెప్పినట్టుగా అఫిడవిట్ లో సంతకం చేయాల్సిందేనట. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేనికి సంతకం? అసలేం జరిగింది? సంతకం చేయాల్సిన అఫిడవిట్ లో ఏముంది? అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలేం జరిగిందో ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నటీనటులకు పరీక్షా సమయం.. ఫిలిం ఇండస్ట్రీ కీలక నిర్ణయం
అసలు విషయంలోకెళితే మలయాళ చిత్ర పరిశ్రమ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ సినిమాల షూటింగ్ సమయంలో మాదకద్రవ్యాలను ఇకపై ఉపయోగించబోము అని అఫిడవిట్లో సంతకం చేయాలి అని ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దీనిని అమలు చేయనున్నట్లు సమాచారం. ఇక షూటింగ్ సమయంలో, వారు నివసించే ప్రదేశాలు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యకలాపాలు జరిగేటప్పుడు కూడా ఇది అమలవుతుందని ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
మాలీవుడ్లో వాటికోసం ప్రత్యేక గదులు.. ఆశ్చర్యంలో నెటిజన్స్
వాస్తవానికి మాలీవుడ్ సినీ పరిశ్రమల్లో మాదకద్రవ్యాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనే వార్తలు ఇటీవల కొంతమంది హీరోయిన్లు బయటపెట్టిన విషయం తెలిసిందే. అక్కడ మాదకద్రవ్యాల ఉపయోగం కోసం సెపరేట్ గదులు కూడా ఉంటాయని సంచలన నిజాలు తెలిపారు. అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇలా కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకోవడంపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కచ్చితంగా నటీనటులందరూ ఇది పాటించాల్సిందే అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
అమ్మాయిల కోసం ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేస్తారా?
ఇక మొత్తానికి అయితే మాలీవుడ్ సినీ ఇండస్ట్రీ బాగుకోసం ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అలాగే అమ్మాయిలకు రక్షణ కల్పిస్తూ ఏదైనా ప్రత్యేక చట్టం తీసుకురావాలని కూడా నటీమణులు కోరుతున్నారు.
ఆశ్చర్యపరిచిన జస్టిస్ హేమా కమిటీ నివేదిక..
వాస్తవానికి మాలీవుడ్ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంది అని జస్టిస్ హేమ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది నటీమణులు మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నామని జస్టిస్ హేమ కమిటీతో తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు. ఈ కమిటీ సమర్పించిన నివేదిక తర్వాత ఆడవారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తామని, ఇప్పటికే ఫిలిం ఛాంబర్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ విషయంలోకి కేరళ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఆడవారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. మరి ఇకనైనా ఇలాంటివి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి.
also read: Actress Sudha: హీరో విజయ్ కూతురు లేచిపోయిందన్నారు.. సోషల్ మీడియాపై సుధ అక్కసు.. ఏమైందంటే?