Kiara Advani: కియారా అద్వానీ(Kiara Advani) పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ సినిమాలో నటించారు. కానీ ఈ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇటీవల మరోసారి రాంచరణ్ తో కలిసి ఈమె గేమ్ చేంజర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా నిరాశపరిచిందని చెప్పాలి.
కూతురికి జన్మనిచ్చిన కియారా…
ఇలా తెలుగు సినిమాలు నిరాశ పరుస్తున్న నేపథ్యంలోనే బాలీవుడ్ సినిమాలపై ఈమె పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. త్వరలోనే ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్(NTR) హీరోలుగా నటించిన వార్ 2(War 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ విడుదల కాబోతోంది. ఇక ఈ ప్రమోషన్లకు కియారా పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఈమె పండంటి ఆడబిడ్డకు (Baby Girl)జన్మనిచ్చిన నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
నువ్వు నా ప్రపంచాన్నే మార్చేసావ్…
ఇకపోతే ఈమె ఇప్పటివరకు తన కుమార్తె ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను మాత్రం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోలేదు. తమ కూతురిని ఇప్పుడే అందరికీ పరిచయం చేయడానికి ఈ జంట పెద్దగా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె తన కూతురితో ఎంతో విలువైన సమయాన్ని గడుపుతూ అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన కూతురి గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈమె స్పందిస్తూ..” నేను నీ డైపర్లు మారుస్తున్నాను.. నువ్వేమో నా ప్రపంచాన్ని మార్చేసావు.. ఈ డీల్ చాలా బాగుంది అంటూ ఉన్న ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేయడమే కాకుండా చేతులతో హార్ట్ సింబల్ చూయిస్తూ ఎమోషనల్ గా ఉన్న ఒక ఎమోజిని షేర్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ అవుతుంది.
సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమ వివాహం…
ఇక ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ మరో బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా(Siddarth Malhotra) ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే .వీరిద్దరూ 2021 వ సంవత్సరంలో షేర్షా సినిమాలో కలిసిన నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరి పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2023వ సంవత్సరంలో పెద్దలను ఒప్పించి ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండు సంవత్సరాలకే ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈమె ప్రెగ్నెన్సీ కారణంగానే ప్రస్తుతం సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఈమె తాజాగా నటించిన వార్ 2 విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాతో పాటు యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమాలో కూడా నటిస్తున్నారు.
Also Read: Coolie Film: సింగపూర్ లో కూలీ హవా.. పవర్ హౌస్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్!