Train Passengers’ Rights: దేశంలో ప్రతి రోజు 2.5 కోట్లకు పైగా ప్రయాణీకులు రైలులో ప్రయాణిస్తున్నారు. భారతదేశ ప్రజా రవాణాకు రైల్వే జీవ నాడిగా కొనసాగుతోంది. చాలా మంది ప్రయాణీకులు రోజువారీ ప్రయాణాలు, సుదూర ప్రయాణాల కోసం రైళ్లపై ఆధారపడుతున్నారు. నిత్యం రైళ్లలో వెళ్తున్నప్పటికీ, వారిలో చాలా మందికి ప్రయాణ సమయంలో లభించే చట్టపరమైన హక్కుల గురించి తెలియదు. ఈ స్టోరీలో చెల్లుబాటు అయ్యే టికెట్ తో రైలు ప్రయాణం చేసే ప్యాసింజర్లకు ఎలాంటి రైట్స్ ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అలా చేస్తే టీటీఈపై సస్పెన్షన్ వేటు తప్పదు!
రైల్వే నిబంధనల ప్రకారం, స్లీపర్, AC కోచ్ లలో చెల్లుబాటు అయ్యే రిజర్వ్డ్ టికెట్లు ఉన్న ప్రయాణీకులను ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) వారి సీట్ల నుంచి తొలగించలేరు. అంతేకాదు, వారితో ఎలాంటి అనుచిత ప్రవర్తనకు పాల్పడకూడదు. ఒకవేళ ఎవరైనా టీటీఈ అలా ప్రవర్తిస్తే వెంటనే హెల్ప్ లైన్ నంబర్ 139 లేదంటే, రైల్ మదద్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు సదరు TTEపై సస్పెన్షన్ వేటు లేదంటే జైలు శిక్షతో సహా కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
కోచ్ శుభ్రంగా లేకపోయినా, క్వాలిటీ ఫుడ్ పెట్టకపోయినా..
టీటీఈ దురుసు ప్రవర్తన మాత్రమే కాదు, కూర్చోవడానికి పనికి రాని విరిగిన సీట్లు, మురికిగా ఉన్న దుప్పట్లు లేదంటే దిండ్లు, అపరిశుభ్రమైన కోచ్ లు, పనిచేయని AC యూనిట్లు, ఛార్జింగ్ పాయింట్లు సహా ఇతర ఆన్ బోర్డ్ సేవలు సరిగా లేకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. నాణ్యత లేని ఆహారం అందించినా కంప్లైంట్ ఇవ్వవచ్చు.
మద్యం తాగినా, పెద్ద సౌండ్ తో మ్యూజిక్ విన్నా..
రైళ్లలో మద్యం సేవించడానికి అనుమతి లేదు. ఒకవేళ ఎవరైనా మద్యం సేవించి పెద్ద పెద్దగా అరిచినా, తోటి ప్రయాణీకులతో దురుసుగా ప్రవర్తించినా, పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ప్లే చేసినా రైల్వే అధికారులకు వెంటనే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. 139కి కాల్ చేయడం ద్వారా లేదంటే రైల్ మదద్ యాప్ నుంచి ఫిర్యాదు చేయడం ద్వారా వారి న్యూసెన్స్ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయంలో, సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రయాణ వాతావరణాన్ని పొందేందుకు ప్రతి రైల్వే ప్రయాణీకుడి హక్కు ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇతరుల దుష్ప్రవర్తన సమస్యను పరిష్కరించడానికి, సేఫ్ గా జర్నీ చేసేందుకు అవసరమైన వాతావరణాన్ని పొందేందుకు అవసరమైనప్పుడల్లా ఈ హక్కులను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. రైల్వే అధికారులు ప్రయాణీకులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందేందుకు అవసరమైనప్పుడల్లా ఫిర్యాదులను చేయాలని సూచిస్తున్నారు. ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన ప్రయాణా అనుభావాన్ని అందించడమే తమ లక్ష్యం అంటున్నారు. సో, ఇకపై మీరు కూడా అవసరం అనుకుంటే ఫిర్యాదు చేయండి. హ్యాపీగా జర్నీ కొనసాగించండి!
Read Also: దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇదే, రోజూ ఎన్ని రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయంటే?