Coolie Film: రజనీకాంత్ (Rajinikanth)హీరోగా నటించిన తాజా చిత్రం కూలీ(Coolie). లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు కానీ, ఇతర అప్డేట్స్ కానీ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. తాజాగా సింగపూర్ పోలీసుల (Singapoor Police) సైతం కూలీ సినిమాకు పవర్ హౌస్(Power House) పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అదరగొట్టిన సింగపూర్ పోలీసులు…
అనిరుద్ సంగీత సారథ్యంలో కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలోని పాటలు మొత్తం విపరీతమైన ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇందులో భాగంగానే పవర్ హౌస్ పాటకు కూడా మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ పాటకు సింగపూర్ పోలీసులు రీల్ చేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా పోలీసులు వారి చొక్కాలపై కేవలం పోలీస్ అని మాత్రమే కనపడే విధంగా ఈ వీడియో ఉంది. ఈ వీడియోలో పోలీసుల కేవలం నడుస్తూ వెళ్తున్నారు ఈ వీడియోకి పవర్ హౌస్ అనే సాంగ్ జోడించి స్లో మోషన్ లో రీల్ చేస్తూ ఈ వీడియోని విడుదల చేశారు.
LCU లో భాగం చేస్తున్నారా?
ఇక ఈ వీడియో ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా సింగపూర్ లో కూడా కూలీ క్రేజ్ ఎలా ఉందో ఈ వీడియో ద్వారా స్పష్టమవుతుంది. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఎంతో విభిన్నంగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. సింగపూర్ పోలీసులకు కూడా రజనీకాంత్ క్రేజ్ ఎంటో స్పష్టమైనది అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఏంటి లోకేష్ భయ్యా.. సింగపూర్ పోలీసులను కూడా మీ ఎల్సీయూలో భాగం చేస్తున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. సింగపూర్ పోలీసులు మాత్రం చాలా బెస్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారంటూ మరికొందరు ఈ రీల్ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.
?igsh=ZTlqNDZhcXJ0d201
ఇక కూలీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది అయితే ఇప్పటికే తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోలైన అమీర్ ఖాన్ సంజయ్ దత్ వంటి వారు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఉపేంద్ర, కింగ్ నాగార్జున, సత్యరాజ్, శృతిహాసన్ వంటి వారు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని మోనిక అనే స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే తళుక్కుమన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే ఈ సినిమా LCU లో భాగం కాదని, ఈ సినిమాకు ఎలాంటి సీక్వెల్ కూడా లేదని డైరెక్టర్ లోకేష్ స్పష్టం చేశారు.
Also Read: Samantha: సినిమాలకు ముందు సమంత చేసిన యాడ్స్ ఇవే.. అస్సలు గుర్తుపట్టలేరు